ఎల్లారెడ్డి: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే తమ లక్ష్యమని వైయస్‌ఆర్ సీపీ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి సిద్ధార్థరెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన యువనేత జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూడడమే ధ్యేయంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు పని చేయాలన్నారు. మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి పథకాల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాటం చేయాలని కార్యకర్తలకు ఆయన సూచించారు.పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు..మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన విధంగా తానూ పాదయాత్ర చేసి అధికారంలోకి రావాలని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని సిద్ధార్థరెడ్డి ఎద్దేవా చేశారు. బాబు ప్రవర్తన పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న విధంగా ఉందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎల్లారెడ్డి మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల భవన నిర్మాణం, బస్‌డిపో, శ్మశానవాటిక ఏర్పాటు కోసం ప్రజలతో కలిసి ఆందోళన చేస్తామన్నారు. వీటి కోసం అసెంబ్లీ వరకు పాదయాత్ర సైతం వెనుకాడబోమన్నారు. కార్యక్రమంలో లింగంపేట, సదాశివనగర్ మండలాల పార్టీ అధ్యక్షులు ఫతియోద్దీన్, శివారెడ్డి, పార్టీ నాయకులు అనీల్‌కుమార్, గుడిపల్లి మహేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, అనీల్‌గౌడ్, అనీస్, రాజశేఖర్, ప్రభు, సంతోష్, నయిం, లక్ష్మీబాయి, విద్యార్థి విభాగం నాయకులు చక్రపాణి, విష్ణు, నీలకంఠం, బాలకిషన్, మౌలానా తదితరులున్నారు.సోనియాకు చంద్రబాబు ఏజెంట్‌గా మారారుసదాశివనగర్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోనియా గాంధీకి ఏజెంట్‌గా మారారని వైయస్‌ఆర్ సీపీ రాష్ట్ర నాయకుడు సిద్ధార్థరెడ్డి అన్నారు. ఆయన పోసానీపేట్‌లో మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై ప్రజలను మోసగిస్తున్నారన్నారు. ప్రాణహిత చేవేళ్ల పథకంలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి రూ. 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనికి జిల్లా మంత్రి సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రైతులను ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట వైయస్‌ఆర్ సీపీ మండల కన్వీనర్ గీరెడ్డి శివారెడ్డి, నాయకులు బల్గంరవి, దాసరి పోచవ్వ, బల్గం రవి, శ్రీనివాస్‌రెడ్డి, బండి శ్రీకాంత్, గాండ్ల సాయిలు, ప్రశాంత్, అశోక్, రమేశ్, బాల్‌రెడ్డి, మల్లారెడ్డి, గాండ్ల రవి, రాజు, తదితరులు ఉన్నారు.ఆణిముత్యంలా విడుదలవుతారు..తాడ్వాయి : వైయస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అణిముత్యంలా విడుదలవుతారని సిద్ధార్థరెడ్డి అన్నారు. ఆయన తాడ్వాయి మండల కేంద్రంలోని పార్టీ కార్యలయంలో మాట్లాడారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పెంచిన పెట్రోల్, డీజిల్, బస్‌చార్జీలు తగ్గించాలని సూచించారు. సోయా రైతులను ఆదుకోవాలని అలాగే వ్యవసాయరంగానికి ఏడుగంటల కరెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ బాల్‌రాజ్‌గౌడ్, జిల్లాకార్యవర్గ సభ్యుడు జంగంరాజు, నాయకులు మహేందర్ రెడ్డి, గంగాధర్, సురుకంటి రాంరెడ్డి, బాలాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.