జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం: గట్టు

తిరుమల, 18 మే 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం ఖాయమని పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రారావు స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబం దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్‌ను గుండెల్లో దాచుకుందని తెలిపారు. గట్టు రామచంద్రరావు శనివారం ఉదయం  వెంకన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ శ్రీ జగన్మోహన్ రెడ్డి  జైలుకెళ్లాక కార్యకర్తలు పార్టీ కోసం కసిగా పనిచేస్తున్నారని చెప్పారు. అధికార, ప్రతిపక్షాలు కుమ్మక్కై ఒక వ్యక్తిపై కుట్రలు చేయటం దారుణమని గట్టు రామచంద్రరావు ఆవేదన వ్యక్తంచేశారు. శ్రీ జగన్మోహన్ రెడ్డి తరపున ప్రజలే ఉద్యమిస్తున్నారనీ, త్వరలోనే జగనన్న ప్రజల్లోకి వస్తారనీ ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Back to Top