వైయస్ జగన్‌ను చూసి నేర్చుకో బాబూ

  • ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి భేష్‌
  • అసెంబ్లీ సీట్ల పెంపు ఆశ చూపి మోసం చేశారు
  • ఫిరాయింపు ఎమ్మెల్యేలు చంద్రబాబును నిలదీయాలి

హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నుంచి నైతిక విలువలు, రాజకీయాలను నేర్చుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం చంద్రబాబుకు సూచించారు. చంద్రబాబు అనైతిక రాజకీయాలు చేస్తున్నారని, ఫిరాయించిన 21 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించలేదని, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన వద్దకు వస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డితో రాజీనామా చేయించారని అది వైయస్‌ జగన్‌ విలువలు, విశ్వసనీయతకు నిదర్శనమని ఆయన వివరించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సీతారాం మీడియాతో మాట్లాడారు. 2026 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. నిన్న పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ మురళిమోహన్‌ అడిగిన ప్రశ్నకు  కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పిందన్నారు. దురదృష్టం ఏంటంటే ఏపీలో ఆ నిర్ణయం రాజకీయంగా టీడీపీలో పెనుతుఫాన్, ప్రకంపనలకు దారి తీస్తోందన్నారు.  అసెంబ్లీ సీట్ల పెంపు కోసం చంద్రబాబు అనేక ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. సీట్లు పెంచితే చాలు ప్రత్యేక హోదా అవసరం లేదని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తుంగలో తొక్కారన్నారు. సీట్ల పెంపు ఆశ చూపి వైయస్‌ఆర్‌సీపీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను తన వైపునకు తిప్పుకున్నారని విమర్శించారు. ఇవాళ అసెంబ్లీ సీట్లు పెరగడం లేదని తేలడంతో టీడీపీలో గందరగోళం నెలకొందన్నారు.  అదిగో సీట్లు, ఇదిగో పెంపు అని మాయమాటలు చెప్పి పచ్చ కండువాలు కప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను వంచించి, ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నారని విమర్శించారు. ఇప్పుడు సీట్ల పెంపు లేదు...స్వీట్లు లేవని ఎద్దేవా చేశారు.  విధానాలు నచ్చకపోతే పార్టీ మారే హక్కు అందరికి ఉంటుందని, అయితే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు రావాలన్నారు. అలా చేస్తే రాజకీయాలకు వన్నే తెచ్చిన వారు అవుతారన్నారు. ఇవాళ శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని, శభాష్‌ అంటూ కొనియాడారు. ఇప్పటికైనా  పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చంద్రబాబును నిలదీయండి. బాబు ప్రలోభాలకు గురై మోసపోయారు. బాబువి అన్ని అబద్ధాలు, అసత్యాలే అన్నారు. మీరు ఎన్నికల్లో ఈ హామీలు ఇచ్చారు కదా అని అడిగితే బాబు ఆవేశపడుతున్నారని తెలిపారు. ఇప్పుడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. నేనిచ్చిన పింఛన్లు, నా రోడ్లు అని బాబు బెదిరిస్తున్నారని, అవేమన్నా మీ అబ్బగారి సొత్తా? అని నిలదీశారు. మోసం చేసిన బాబును అరెస్టు చేయాలని డ డిమాండ్‌ చేశారు. ఓటర్లను కొంటారా? మీ ఓటుకు కోట్లు కేసు అయిపోయిందనుకుంటున్నావా? పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కేసుపై మాట్లాడుతున్నారు. మీరు జైలుకు వెళ్లడం ఖాయమని తమ్మినేని హెచ్చరించారు. చంద్రబాబు వ్యాఖ్యలను కోర్టు సుమోటాగా తీసుకోవాలని కోరారు. ఇలాంటి వ్యవహారంలోనే పాకిస్తాన్‌ ప్రధాని నవాబ్‌ షరీఫ్‌ జైలుకు వెళ్లాడన్నారు. అలాగే చంద్రబాబును అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.   
 దటీజ్‌ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారని దటీజ్‌ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అని తమ్మినేని సీతారాం అన్నారు. వైయస్‌ జగన్‌కు విలువలు, సిద్ధాంతం ఉందన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇలాంటి లేవని ధ్వజమెత్తారు. ఇకనైనా వైయస్‌ జగన్‌ను చూసి బాబు నేర్చుకోవాలని హితవు పలికారు.  చంద్రబాబుకు ఓ శాపం ఉందని, ఆయన సత్యం పలికితే తల వెయ్యి ముక్కలు అవుతుందని ఆకాశవాణి జోస్యం ఉందని తెలిపారు. చంద్రబాబు అంటేనే అబద్ధానికి, అసత్యానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ అని తమ్మినేని సీతారాం ఎద్దేవా చేశారు. 
Back to Top