అసెంబ్లీలో పచ్చనేతల పైత్యం..చర్చలకు ఆటంకం


అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగకుండా పాలకపక్షం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. రెండో రోజు సభలో గందరగోళం సృష్టించింది.  అన్నికార్యక్రమాలను పక్కనబెట్టి ప్రత్యేక హోదాపై చర్చించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐతే, స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు.  స్పెషల్ స్టేటస్ పై చర్చ జరిగిన తర్వాతే మిగతా వాటిపై చర్చ చెపట్టాలని వైఎస్సార్సీపీ నిలదీసింది.  ప్రత్యేక హోదా అంశాన్ని రాష్ట్రాన్ని కుదిపేస్తోందని, దాని తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం చర్చ జరపాలని జగన్ అన్నారు.


ఐదు రోజు సమావేశాల్లో ఇప్పటికే అధికారపక్షం ఒకరోజు సమయాన్ని వృథా చేసిందని జగన్ ఆరోపించారు. చివరి వరకు చర్చ జరగనీయకుండా చూడాలని ప్రభుత్వం కుట్రపన్నుతోందన్నారు. సీఎం ప్రకటన ముగిసిన వెంటనే ప్రత్యేక హోదాపై చర్చ జరగాలని జగన్ అన్నారు. నిన్నటి సభలో బాబు అర్థగంట ప్రసంగం చేసి సమావేశాలను ముగించారని, బాబు ప్రసంగానికి, స్టేట్ మెంట్ లో ఉన్నదానికి అసలు పొంతనే లేదని జగన్ విమర్శించారు. 

అసెంబ్లీలో ప్రజావాణి వినిపిస్తున్న వైఎస్సార్సీపీకి ప్రభుత్వం ఏమాత్రం సహకరించడం లేదు. ప్రజారంజకంగా పాలన సాగించాల్సిన వారే బరితెగిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులపై వ్యక్తిగత దూషణలు చేస్తూ సభా నియమాలను మంటగల్పుతున్నారు.  స్పెషల్ స్టేటస్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఆది నుంచి ముందు వరుసలో పోరాడుతుంది. దేశ,రాష్ట్ర రాజధాని సహా అనేక ప్రాంతాల్లో ధర్నా నిర్వహించి స్పెషల్ స్టేటస్ కు ఉన్న ప్రాముఖ్యతను చాటిచెప్పింది. రాష్ట్రబంద్ కు పిలుపునిచ్చి ప్రజలను ఐక్యం చేసింది.  ఈక్రమంలోనే మరోసారి ప్రత్యేక హోదా సాధనను అసెంబ్లీలో లేవనెత్తేందుకు సిద్ధమైంది. కానీ, చర్చజరగనీయకుండా ప్రభుత్వం ఆటంకం సృష్టిస్తోంది. 
Back to Top