జాతిపిత బాపూజీకి వైయస్‌ఆర్‌సిపి నివాళి

హైదరాబాద్‌, 30 జనవరి 2013: జాతిపిత మహాత్మాగాంధీ 65వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ బుధవారం నివాళులు అర్పించింది. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి పలువురు నాయకులు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో నాయకులతో పాటు పార్టీ శ్రేణులు కూడా పాల్గొన్నారు. గాంధీజీ వారసులమని చెప్పుకునే వారే ఆయన ఆశయాలను తుంగలో తొక్కారని ఈ సందర్భంగా మాట్లాడిన వారు అన్నారు.
Back to Top