చంద్రబాబూ.. సిగ్గుతో తలదించుకో..!


() గ్రామాల మధ్యన కాలుష్య పరిశ్రమలు వద్దంటే పట్టదా

() ప్రైవేటు పరిశ్రమ కోసం చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకింత పంతం

() పరిశ్రమను వ్యతిరేకిస్తే హత్యాయత్నం కేసు పెట్టిస్తారా

() సముద్ర తీరానికి పరిశ్రమ తరలిస్తే మేలు

() తణుకులో బాధితుల్ని పరామర్శించిన జననేత వైయస్ జగన్

తణుకు)) ప్రజల ఉసురు పోసుకొని పరిశ్రమ పెట్టుకోవాలన్న పంతం ఎందుకని
ప్రతిపక్షనేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నిలదీశారు. పరిశ్రమ పేరుతో
అరాచకాలు చేస్తున్న చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలని ఆయన హితవు పలికారు. పశ్చిమ
గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా వైయస్ జగన్ తణుకులో పర్యటించారు. మెగా ఆక్వా ఫుడ్
ను వ్యతిరేకిస్తున్న బాధితుల మీద దొంగ కేసులు మోపి, తణుకులోని సబ్ జైలు లో
బంధించారు. జననేత జగన్ నేరుగా సబ్ జైలుకి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. పార్టీ
తరపున సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వ
బండారాన్ని బయట పెట్టారు. ప్రైవేటు పరిశ్రమ ప్రయోజనాల కోసం ప్రజల్ని ఇబ్బంది
పెట్టడం తగదని, ప్రజలంతా వ్యతిరేకిస్తున్న పరిశ్రమను సముద్రతీరానికి తరలించాలని
సూచించారు. వైయస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

ఇవేమి కేసులు..!

        సత్యవతమ్మను కలిశాం. చాలా
దయనీయమైన పరిస్థితి. అమ్మ జైలు లో ఉంది, నాన్న క్యాన్సర్ తో బాధ పడుతున్నారు.
అన్నయ్యను ఇంకో సబ్ జైలు లో పెట్టారు. కుటుంబాలకు కుటుంబాల్నే జైలులో బంధించేశారు.
కేసులు చూస్తే.. ఐపీసీ సెక్షన్ 307 కింద కేసులు పెట్టారు. అంటే హత్యకు
ప్రయత్నించటం అనే కఠినమైన సెక్షన్ ల కింద కేసులు కట్టారు. ఇంతకీ ఈ బాధితులు
చేసింది ఏమిటి అంటే... ప్రాజెక్టు ఇక్కడ పెట్టవద్దు, పెట్టినట్లయితే ఇక్కడ
కాలుష్యం ప్రబలిపోతుంది. ఆ కాలుష్యంతో మేం బతకలేని పరిస్థితి తలెత్తుతుందని, ఇది
అన్యాయం అని ఆందోళన వ్యక్తం చేస్తే.. అటువంటి బాధితుల మీద హత్యాయత్నం కేసులు
పెడుతున్నారు. మహిళలైనా చూడకుండా సత్యవతమ్మ వంటి బాధితుల్ని తీసుకొని వచ్చి సబ్
జైలులో పెడుతున్నారు.

        పైగా ఎఫ్ ఐ ఆర్ లో చూస్తే
హత్యాయత్నం కు పాల్పడిన వారు ఏడుమంది మరి కొందరు అని పెట్టారు. అంటే తర్వాత కాలంలో
మరి కొందరిని ఇరికించేందుకు వీలుగా ఈ విధంగా ఎఫ్ ఐ ఆర్ ను రూపొందించారు. సత్యవతమ్మ
పేరు కూడా మొదట్లో లేనే లేదు. కానీ మరికొందరు అన్న ఆప్షన్ కిందనే ఆమె పేరు కూడా
ఇరికించారు. ఈ విధంగా గ్రామాల్లో భయాందోళనలు కలిగిస్తున్నారు. ప్రాజెక్టుని
వ్యతిరేకిస్తే చాలు కేసులు పెట్టేస్తామంటూ భయపెడుతున్నారు.

ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..!

        ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా
అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే స్థానికంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండానే
పరిశ్రమను బలవంతంగా రుద్దుతున్నారు. చేస్తున్న పనుల్ని చూస్తే చంద్రబాబు సిగ్గుతో
తలదించుకోవాలి.

        మొదటగా గ్రామాల మధ్యన ఇటువంటి
కాలుష్యం చిమ్మే పరిశ్రమలు పెట్టడమే పెద్ద తప్పు. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా,
స్థానికుల అభిప్రాయాలు తెలుసుకోకుండా పెట్టడం మరో తప్పు. ఇటువంటి పరిశ్రమలు
మాకొద్దని చెప్పినందుకు గాను గ్రామస్తుల మీద హత్యాయత్నం కేసు పెట్టడం మూడో తప్పు.
గ్రామాల్లో నెలల తరబడి 144వ సెక్షన్ ప్రయోగించటం నాలుగో తప్పు. ఇటువంటి పనులకు
ఒడిగట్టడం అంటే ఏమని అర్థం చేసుకోవాలి.

        వాస్తవానికి ఇది ఒక ప్రైవేటు
ప్రాజెక్టు. గతంలో ఇదే ప్రాంతంలో డెల్టా పేపర్ మిల్లు ఏర్పాటు చేశారు. దాన్ని
ఆనుకొని కొన్ని చిన్నస్థాయి ప్రాసెసింగ్ పరిశ్రమలు పెట్టారు. వాటి నుంచి ఎలమందూరు
డ్రెయిన్ లోకి కాలుష్య రసాయనాలు వదులుతున్నారు. దీంతో ఈ డ్రెయిన్ మీద ఆధారపడి
వ్యవసాయం చేసుకొంటున్న రైతులు, మత్స్యకారులు ఇబ్బందుల్లో కూరుకొని పోయారు. ఇప్పుడు
గొర్తేరు డ్రెయిన్ మీద ఆధారపడి వేలాది రైతులు బతుకుతున్నారు. ఆ డ్రెయిన్ లోకి ఈ
విషరసాయనాలు వదిలినట్లయితే చాలా ఇబ్బందులు ఏర్పడుతాయి.

పరిష్కారం ఉంది కదా..!

        ఈ ఫ్యాక్టరీ ని ఇక్కడకు పది
కిలోమీటర్ల దూరంలోని సముద్రతీరానికి తరలిస్తే సరిపోతుంది. అక్కడ ఇదే పరిశ్రమ
యాజమాన్యం తాలూకు వారికి భూములు ఉన్నాయి వాటినే ఉపయోగించుకొంటే మేలు. సముద్ర
తీరంలో అయితే అక్కడ ఫ్యాక్టరీ నుంచి వెలువడే కాలుష్య పదార్థాలు నేరుగా సముద్రంలోకి
వదిలేసుకొంటే సరిపోతుంది. ఇంత మంది ఉసురు పోసుకొని ఫ్యాక్టరీ పెట్టాలనుకోవటం ఎంత
వరకు సబబు.

        ఒక వైపు చంద్రబాబు ప్రభుత్వం ఈ
పరిశ్రమ నుంచి కాలుష్య పదార్థాలు ఏమీ విడుదల కావు అని చెబుతుంది మరో వైపు, కాలుష్య
పదార్థాలు పంపించేందుకు పైప్ లైన్ ఏర్పాటు చేస్తున్నాం అని చెబుతారు. దీని అర్థం
ఏమిటి. అంటే ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున కాలుష్య పదార్థాలు వెలువడతాయనే కదా. ఈ పరిశ్రమ
లో 3వేల టన్నుల మత్స్య ఆహార పదార్థాల్ని ప్రాసెస్ చేస్తారని ప్రాజెక్టు రిపోర్టులో
చెప్పారు. అంటే 3వేల టన్నుల ఆహారాన్ని కెమికల్స్ తో కడుగుతారు. దాన్ని బట్టి ఏ
స్థాయిలో కాలుష్యాలు విడుదల అవుతాయో అర్థం అవుతుంది కదా. పైగా ఈ పరిశ్రమ కేంద్ర
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఆరంజ్ జోన్ లో ఉంది అంటే భారీగా కాలుష్యం
వెదజల్లుతుంది అనే కదా అర్థం. ఎందుకు ప్రజల్ని తప్పు దారి పట్టిస్తున్నారు.

ఎందుకంత తాపత్రయం..!

        పైగా ఇది ఒక ప్రైవేటు సంస్థ
నిర్మిస్తున్న ప్రాజెక్టు. అటువంటప్పుడు ప్రైవేటు సంస్థ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం
తరపున పైప్ లైన్ నిర్మిస్తాం అని చెబుతున్నారు. ఈ పైప్ లైన్ వేయటానికి అయ్యే
ఖర్చును ఎవరు భరిస్తారు. ప్రజల సొమ్ముతో ప్రైవేటు సంస్థల కోసం పైప్ లైన్ లు
నిర్మించటం ఏమిటి... 25, 30 కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టి పైప్ లైన్
నిర్మిస్తారా... మిగిలిన ప్రైవేటు సంస్థలకు కూడా ఈ విధంగానే నిర్మిస్తారా... అసలు
ఒక ప్రైవేటు సంస్థ ప్రాజెక్టు కోసం ప్రభుత్వానికి ఎందుకంత తాపత్రయం..! పోలీసు బలగాల్ని రంగంలోకి
దింపి మరీ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాల్సినంత అవసరం ఏం వచ్చింది..!

సూటిగా సూచన..!

            ఇటువంటి పరిస్థితుల్లో
యాజమాన్యానికి నేను ఒకటే విన్నపం చేస్తున్నా. మీరు కొంత మేర పెట్టుబడులు పెట్టి
ఉండవచ్చు. మొత్తం యూనిట్ ను సముద్రతీరానికి తరలిస్తే పెద్దగా నష్టం జరగదు. ఇక్కడ
రెండేళ్లుగా పరిశ్రమ వద్దంటూ ఆందోళనలు జరుగుతున్నాయి. అయినా మీరు పట్టించుకోవటం
లేదు. గ్రామ సభలు అంగీకారం తెలపలేదు. అయినా సరే మీరు ముందుకు వెళ్లారు. అంటే మీ
వైపు నుంచి తప్పు ఉంది. పది కిలోమీటర్ల దూరంలోని సముద్ర తీరం దగ్గరే మీకు భూములు
ఉన్నాయి. అక్కడ మీ ప్రాజెక్టు ఏర్పాటు చేసుకోండి. మేమంతా మీకు సపోర్ట్ చేస్తాం.
గ్రామస్తులు అంగీకరిస్తారు. అందరికీ మంచి జరుగుతుంది. ఎవరికీ ఇబ్బంది లేకుండా 25, 50
ఏళ్లపాటు ప్రాజెక్టు నడుస్తుంది. ఈ పైప్ లైన్ కు పెట్టే డబ్బులు పెడితే మీ యూనిట్
అక్కడకు తరలింపు అయిపోతుంది. గ్రామస్తుల ఉసురు పోసుకోకండి, మంచిగా ప్రవర్తించండి.

 

అని వైయస్ జగన్ సూటిగా అభిప్రాయాన్ని తెలియచేశారు.

        

Back to Top