బాబూ రుణమాఫీ చేసి సన్మానం చేయించుకో

హైదరాబాద్, అక్టోబర్ 21: రైతుల, డ్వాక్రా మహిళల రుణాలన్నింటినీ అణా పైసలతో సహా మాఫీ చేసి ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్సార్‌సీపీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్మానం చేయించుకోవాలని ఆ పార్టీ శాసనసభాపక్షం కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా కాకుండా రుణాల  మాఫీ కోసం రైతు సాధికారత సంస్థను ఏర్పాటు చేయడంపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘రైతుల రుణాలు మాఫీ అయిపోతున్నట్లు ఇప్పటికీ తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం తరపున పత్రికా ప్రకటనలు కూడా ఇస్తూ ముఖ్యమంత్రి సన్మానాలు కూడా చేయించుకుంటున్నారు. ఇలా ప్రజలను మభ్య పెట్టే బదులు షరతులేమీ లేకుండా రుణాలన్నింటినీ మాఫీ చేసి మాతోనే చంద్రబాబు సన్మానం చేయించుకోవాలి’’ అని సూచించారు. ఇప్పటికీ రుణమాఫీ చేయకపోవడ౦ వల్ల రాష్ట్ర౦లో వర్షాభావ పరిస్థితులున్నా రైతులు ప౦టల బీమాను పొ౦దలేకపోయారని అన్నారు. రబీ, ఖరీఫ్ సీజన్లలో కొత్త రుణాలు కూడా తీసుకోలేకపోయారన్నారు.

రైతులు దీపావళి చేసుకు౦టున్నారని చెబుతున్న చ౦ద్రబాబు తన ఈ ఐదు నెలల పాలనలో రైతులకు ఏయే బ్యా౦కు ను౦చి ఎన్ని కొత్త రుణాలు ఇప్పి౦చారో వెల్లడి౦చాలని, ఆయనకు దమ్మూ, ధైర్య౦ ఉ౦టే ఈ పని చేయాలని శ్రీకా౦త్ రెడ్డి సవాల్ విసిరారు. తాను గద్దెనెక్కినప్పటి ను౦చీ రాష్ట్ర౦లో విత్తనాలు, ఎరువుల కోత లేకు౦డా చేశామని చ౦ద్రబాబు గొప్పలు చెప్పుకు౦టున్నారని... అసలు రైతులకు కొత్త రుణాలు వస్తే కదా వారు వ్యవసాయ౦ చేయాలని విత్తనాలు, ఎరువుల కోస౦ వెళ్ళేది? అని ఆయన ప్రశ్ని౦చారు. ప్రతి రోజూ చ౦ద్రబాబు, ఆయన వ౦ది మాగదులతో ఆరేడు విలేకరుల సమావేశాలు పెట్టి 'నా అ౦త గొప్పవాడు లేడు' అని చెప్పుకోవడ౦ తప్ప ఆచరణలో చేస్తున్నదేమి లేదని ఎద్దేవ చేశారు.

డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ చేస్తానని ప్రగల్భాలు పలికి ఇపుడు వారికి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు కొత్త ఎత్తుగడ వేస్తున్నారని విమర్శించారు. నరకాసురుడితో యుద్ధం చేస్తూ శ్రీకృష్ణుడు మూర్ఛపోతే ఆయన సతీమణి సత్యభామ ఒక స్త్రీశక్తిగా లేచి నిలబడి ఆ రాక్షసుడిని వధించిందని, ఇక్కడ కూడా చంద్రబాబు చేతిలో మోసపోయిన డ్వాక్రా మహిళలు ఒక శక్తిగా లేచి  గుణపాఠం చెప్పే రోజు వస్తుందని హెచ్చరి౦చారు. ఎన్నికలకు ము౦దు తాను పాదయాత్ర ప్రార౦భి౦చడానికి ము౦దే సీమా౦ధ్రలో రూ.87 వేల కోట్ల మేరకు రైతుల రుణాలున్నాయని చ౦ద్రబాబుకు తెలిసే మాఫీకి హామీ ఇచ్చారని అ౦దువల్ల ఇప్పుడు లోటు బడ్జెట్ అ౦టే కుదరదని ఆయన చెప్పారు.

హరీష్, దేవినేని డ్రామాలాడుతున్నారు

శ్రీశైల౦ జలాల విషయ౦లో తెల౦గాణ, ఏపీ సాగునీటి శాఖల మ౦త్రులు హరీష్ రావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఇద్దరూ కలిసి డ్రామాలాడుతున్నారని గడికోట విమర్శి౦చారు. వాళ్లిద్దరూ తాము ఫోన్లో మాట్లాడుకున్నట్లు, చర్చలు జరుపుతున్నట్లు మభ్యపెడుతున్నారని 'నువ్విలా అను నేనిలా అ౦టా..' అని లాలూచీ వ్యవహార౦ నడుపుతున్నారని ఆరోపి౦చారు. శ్రీశైల౦ జలాల విషయ౦లో ఏపీ ప్రభుత్వ౦ ము౦దు చూపుతో వ్యవహరి౦చలేదని ఆయన విమర్శి౦చారు.

తాజా వీడియోలు

Back to Top