వైద్యం ఖర్చు మొత్తం భరిస్తా


నిరుపేద దంపతుల ముఖాల్లో పట్టరాని సంతోషం

గుంటూరు: మూగ, చెవిటితో బాధపడుతున్న చిన్నారికి అయ్యే వైద్యం ఖర్చు మొత్తం భరిస్తానని ఆ నిరుపేద దంపతులకు వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. దీంతో తమ బిడ్డ ఆరోగ్యం బాగుపడుతుందని ఆ తల్లిదండ్రుల పట్టరాని సంతోషం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రజల సంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఊట్కూరు నుంచి వచ్చిన ముస్లిం దంపతులు కలిశారు. వారి బిడ్డకు పుట్టుకతోనే మాటలు రావడం లేదు. చెవులు వినపడడం లేదని జననేతకు తమ సమస్యను చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళితే.. పరీక్షలు చేసి రూ. 17 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారని, కలెక్టర్‌కు, మంత్రికి అర్జీలు పెట్టినా పట్టించుకోలేదన్నారు. ఆస్పత్రులకు ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్తే పనికిరాదంటటూ బయటకు పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   వారి దీనస్థితిని విని చలించిపోయిన వైయస్‌ జగన్‌ చిన్నారికి అయ్యే వైద్యం ఖర్చు మొత్తం భరిస్తానని ఆ దంపతులకు భరోసా ఇచ్చారు. దీంతో వారు తమ బిడ్డకు ఆరోగ్యం బాగుపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. 
Back to Top