గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రకు ప్రజలకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఈ నియోజకవర్గానికి చేరుకున్న జగన్ కు అఫూర్వ స్వాగతం పలికారు. రహదారులకు ఇరువైపులా బారులు తీరి నిలబడ్డారు. జననేతతో అడుగులో అడుగు వేసుకుంటూ మద్దతు పలుకుతున్నారు. <br/><br/><br/><br/>ఈ పాదయాత్రలో ప్రజలు అడుగడుగునా తమ బాధలను ఆయనతో చెప్పుకొని కన్నీటి పర్యంతం అవుతున్నారు. వారందరికీ తగిన భరోసా ఇస్తూ భవిష్యత్తుపై నమ్మకం కలిగిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు. వైయస్ జగన్ రాకతో ప్రజాసంకల్పయాత్ర సాగుతున్న ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి రహదారులున్నీ జన సంద్రంగా మారాయి. పాదయాత్రగా వస్తున్న జననేతలో మహానేత రాజన్నను చూసుకుంటూ తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. బాధలను చెప్పుకుంటూ కన్నీటి పర్యంతం అవుతున్న వారికి భరోసా ఇస్తున్నారు. వేలిముద్రలు పడటం లేదంటూ ఫించను ఇవ్వడం లేదంటూ వృద్ధులు, రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిలు విడుదల కాక నానా పాట్లు పడుతున్నామంటూ విద్యార్ధులు , ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు ఇలా అనేక మంది జననేతకు సమస్యలను చెప్పుకుంటున్నారు. వారందరికీ న్యాయం జరిగేలా చూస్తానంటూ విశ్వాసం కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు వైయస్ జగన్ .