సమైక్య శంఖారావానికి హైకోర్టు అనుమతి

హైదరాబాద్  16 అక్టోబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు హైకోర్టు అనుమతించింది.  హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ‘సమైక్య శంఖారావం’ సభ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం రెండు గంటల నుంచి అయిదు గంటల వరకూ సభ నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. సమైక్య శంఖారావానికి  పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌పై హైకోర్టు పైమేరకు తీర్పునిచ్చింది. డీసీపీ కమలాసన్ రెడ్డి ఇచ్చిన  ఉత్తర్వులను కొట్టేసింది. తమ సభకు అనుమతి మంజూరు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ హౌస్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు  బుధవారం ఉదయం అనుమతినిస్తూ తీర్పు ఇచ్చారు.

Back to Top