సమైక్య శంఖారావంపై 12 లోగా బదులివ్వాలి

హైదరాబాద్, 9 అక్టోబర్ 2013:

హైదరాబాద్ లా‌ల్ బహదూ‌ర్ స్టేడియంలో వై‌యస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ ఈ నెల 19న తలపెట్టిన 'సమైక్య శంఖారావం' సభకు అనుమతిపై ఏ నిర్ణయం తీసుకున్నదీ 12లోగా సమాధానం ఇవ్వాలని సెంట్రల్ జో‌న్ ‌డిసిపికి హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తాము నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు అనుమతిని ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలంటూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఎల్బీ స్టేడియంలో 19వ తేదీన సమైక్య శంఖారావం సభ నిర్వహణకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఈ‌ నెల 3న సెంట్రల్ జో‌న్ ‌డిసిపికి దరఖాస్తు చేసింది. అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందనా రాకపోవటంతో న్యాయస్థానాన్ని పార్టీ ఆశ్రయించింది.

Back to Top