హంద్రీనీవా అనగానే వైయస్సే గుర్తొస్తారు

వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి
కదిరి: హంద్రీనీవా పేరు చెప్పగానే దాని గురించి అవగాహన ఉన్న వారికి ఎవరికైనా వెంటనే మహానేత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి గుర్తుకొస్తారని వైయస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ పీవీ సిద్ధారెడ్డి అన్నారు. స్థానిక ఆర్‌డీఓ కార్యాలయం ముందు సీపీఐ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరుకున్న సందర్భంగా శనివారం ఆయన వారి శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్‌ హయాంలో హంద్రీనీవా పనులు దాదాపు 80 శాతానికి పైగా యుద్ధప్రాతిపదికన జరిగాయన్నారు. ఆయన అకాల మరణం తర్వాత మిగిలిన పనులు పూర్తిగా ఆగిపోయాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం కమీషన్లకు కక్కుర్తి పడుతూ హంద్రీనీవా పనుల అంచనాలను భారీగా పెంచేశారని విమర్శించారు. వైయస్‌ ఉన్నట్లయితే ఈపాటికి ఎప్పుడో హంద్రీనీవా నీటితో అన్ని చెరువులనూ నింపేవారన్నారు. 
Back to Top