'గ్రామీణ వైద్యులకు అండగా నిలుస్తాం'

కర్నూలు:

గ్రామీణ వైద్యులకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. సమస్యల పరిష్కారానికి నగరంలో రిలే నిరాహార దీక్షలను చేపట్టిన గ్రామీణ వైద్యులు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ... దివంగత ముఖ్యమంత్రి  డాక్టర్ వైయస్ రాజశేఖర్‌ రెడ్డి గ్రామీణ వైద్యులను కమ్యూనిటీ పారా మెడికల్సుగా గురిస్తూ.. వారికి శిక్షణ ఇచ్చేందుకు జీవో నంబర్ 429ని జారీ చేశారని గుర్తుం చేశారు. మహానేత మృతి చెందిన తరువాత గ్రామీణ వైద్యులను మరచిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు.  పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ వైద్యుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతానని హామీ ఇచ్చారు.

Back to Top