మసీదుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి

రాయచోటి రూరల్‌: మసీదుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సభాభవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ మసీదుల అభివృద్దితో పాటు , మసీదుల్లో పని చేసే మౌజమ్‌లు, నేసిహమ్‌లకు కూడా జీతభత్యాలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రంజాన్‌కు మసీదుల్లో అభివృద్ది పనులకు అందిస్తున్న రూ.7600లను, మరో 10–15 రోజులు ముందుగానే పంపిణీ చేసి ఉంటే మసీదుల్లో ఉన్న చిన్నపాటి మరమ్మతులు చేసుకునేందుకు వీలుగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. పవిత్ర రంజాన్‌ మాసంలో తాను కూడా వరుసగా 5వ రోజు ఉపవాస దీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నో మంచి లక్షణాలు కలిగే ఈ రంజాన్‌ మాసాన్ని ముస్లీం సోదరులంతా సుఖసంతోషాలతో చేసుకోవాలని, రైతులకు కూడా ఈ మాసం నుంచి శుభాలు కలగాలను ఆయన ఆకాక్షింఆచరు. ఈ సంధర్భంగా అందరికీ ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి రంజాన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మండల పరిధిలోని 9 మసీదులకు ఒక్కొక్క మసీదుకు రూ.7600లు చొప్పున చెక్కులను ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలచే పంపిణీ చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవికుమార్, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, సర్పంచ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి, బీసీ నాయకులు పల్లపు రమేష్, సర్పంచ్‌లు జిలానీబాషా, బసయ్య, ఎంపీటీసీలు ప్రభాకర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి , గంగిరెడ్డి,కోఆప్షన్‌ సభ్యులు దివానీ సాహెబ్‌ , పలువురు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.

చిన్నమండెంలో....
మండల పరిధిలోని 14 మసీదులకు ఒక్కొక్క మసీదుకు రూ.7600లు చొపున చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంధర్భంగా శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సభాభవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీడీఓ జీవీ రమణారెడ్డి, ప్రత్యేక అధికారి గుణశేఖర్‌పిళ్లైలతో పాటు కోఆప్షన్‌ సభ్యులు గౌస్‌సాహెబ్, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొని మసీదు నిర్వాహకులకు చెక్కులు పంపిణీ చేశారు.

Back to Top