() దళితుల నిధుల్ని పక్కదారి పట్టిస్తున్న చంద్రబాబు() బలహీన వర్గాల నిధుల్ని వేరే అవసరాలకు వాడుకొంటున్న ప్రభుత్వం() అంబేద్కర్ స్ఫూర్తిని తుంగలోకి తొక్కుతున్న సర్కారు() టీడీపీ తప్పుల్ని ఎత్తి చూపిన జన నేత వైఎస్ జగన్హైదరాబాద్) అంబేద్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు పొడుస్తోందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలకు సంబంధించి ముఖ్యమంత్రి చేసిన ప్రకటన మీద స్పందిస్తూ దళితులకు ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ప్రస్తావించారు. సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఇస్తున్న నిధుల్ని పూర్తిగా వెచ్చించటం లేదని వైఎస్ జగన్ గణాంకాలతో సహా వెల్లడించారు. 2015..16 కు సంబంధించి 38, 671 కోట్లను ప్రణాళిక వ్యయంగా చూపించారని, జనాబా ప్రాతిపదికన ఇందులో ఎస్సీలకు రూ. 6,574 కోట్లు ఖర్చు చేయాలని చెప్పారు. కానీ రూ. 4,054 కోట్లను ఖర్చు చేసి దాదాపు రూ. 2వేల 500 కోట్లు దాకా ఎగ్గొట్టారని పేర్కొన్నారు. అటు ఎస్టీలకు సంబంధించి రూ. 2వేల కోట్ల దాకా రావాల్సి ఉండగా, 12వందల 73 కోట్లు ఇచ్చి దాదాపు 800 కోట్ల దాకా ఎగ్గొట్టారని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన నిధుల్నే పక్క దారి పట్టించటం ఎంత వరకు భావ్యం అని ఆయన ప్రశ్నించారు. ఉపాధి హామీ లోనూ తిరకాసేజాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలోనూ రాష్ట్ర ప్రభుత్వం మొండి చేయి చూపిస్తోందని వైఎస్ జగన్ చెప్పారు. ఈ పథకం కింద రూ. 4,700 కోట్లు పేదలకు ఉపాధి కల్పించేందుకు వినియోగించాల్సి ఉంది. నిరుపేదలకు వందో, 150 కూలీ కింద ఇస్తే ఉపాధి దొరకుతుందని భావిస్తుంటారు. ఇందులో సిమెంట్ రోడ్లకు వెయ్యి కోట్ల రూపాయిలు, నీరు..చెట్టు పనులకు 2,500 కోట్ల రూపాయిలు వెచ్చించారని అంటే మొత్తం 3,500 కోట్లు పక్క దారి పట్టించేశారని గణాంకాలతో సహా చెప్పారు. దాదాపు మూడో వంతు నిధులు పక్కకు పోయాయని వివరించారు. దివంగత వైఎస్సార్ హయంలోనే అసలైన ఉపాధిఉపాధి హామీ పథకాన్ని సమర్థంగా అమలు చేసిన ఘనత దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి దక్కుతుందని వైఎస్ జగన్ వెల్లడించారు. అప్పట్లో పూర్తిగా మానవ వనరుల వినియోగానికి నిధులు వెచ్చించేవారని, దీంతో సమర్థంగా పేదలకు ఉపాధి దొరికేదని పేర్కొన్నారు. ఇప్పుడు మాత్రం మెటీరియల్ కాస్ట్ ను ఎక్కువగా పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేమంటే కేంద్ర ప్రభుత్వం పేరు చెబుతున్నారని, అక్కడ కూడా వాళ్ల ప్రభుత్వమే ఉన్నందున పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు ఎందుకు ప్రయత్నించరని సూటిగా ప్రశ్నించారు.