రాజీనామా చేసి రా నీవా నీనా తేల్చుకుందాం..

మోడీ,
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు దోపిడీ దొంగలుగా మారారని పాడేరు ఎమ్మెల్యే
గిడ్డి ఈశ్వరి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజధాని ప్రాంతంలో
భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా ఎంతకైనా పోరాడతానని చెప్పిన పవన్
కల్యాణ్ ...వారిని తీవ్రంగా అన్యాయం చేశాడని మండిపడ్డారు. ఆదివాసీలకు
పునరావాసం కల్పిస్తామని, గిరిజనులకు అన్యాయం చేయమని చంద్రబాబు, పవన్
కళ్యాణ్ లు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. 

రాజకీయ
స్వలాభం కోసం మాయమాటలు చెబుతూ ప్రజలను మోసగిస్తున్నారని ఈశ్వరి
మండిపడ్డారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్న చంద్రబాబు గతంలో బాక్సైట్ ను
వ్యతిరేకించిన సంగతి గుర్తుకు లేదా అని ప్రశ్నించారు.  అరకు గ్రామాన్ని
దత్తత తీసుకున్న చంద్రబాబు..ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు.
లోకేష్, దైవాంశులున్నాక చంద్రబాబుకు పేద ప్రజల మనోభావాలు ఎలా తెలుస్తాయని
ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దమ్మూ ,ధైర్యం ఉంటే రాజీనామా చేసి రావాలని,
ఎవరు గెలుస్తారో తేల్చుకుందామని ఈశ్వరి సవాల్ విసిరారు.
Back to Top