గాంధీకి పులివెందులలో విజయమ్మ నివాళి

పులివెందుల (వైయస్‌ఆర్‌ కడప జిల్లా), 2 అక్టోబర్‌ 2012: జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని వైయస్‌ఆర్‌ కడప జిల్లా పులివెందులలో మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో ఉన్న బాపూజీ విగ్రహానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్‌ విజయమ్మ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జనం భారీగా తరలివచ్చారు. అనంతరం విజయమ్మ అక్కడి నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. ఇవాళ, రేపు పులివెందులలోనే ఉండి విజయమ్మ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళతారు.

Back to Top