భ‌విష్య‌త్తు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీదే


  • వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జాత‌కం బాగుంది
  • 2019లో వార్ వ‌న్ సైడ్‌
  • పంచాగక‌ర్త రామ‌చంద్ర‌శాస్త్రీ  
  • వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఘ‌నంగా ఉగాది వేడుక‌లు

హైద‌రాబాద్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని, 2019లో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కావ‌డం ఖాయ‌మ‌ని పంచాగ‌క‌ర్త రామ‌చంద్ర‌శాస్త్రీ జోష్యం చెప్పారు. బుధ‌వారం హైద‌రాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఉగాది వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. వేడుక‌ల్లో పాల్గొన్న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, అనంత‌రం దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హానికి నివాళుల‌ర్పించారు. అనంత‌రం రామ‌చంద్ర‌శాస్త్రీ పంచ‌గ‌శ్ర‌వ‌ణం చేశారు.  వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి జాత‌కం బాగానే ఉంద‌ని, ఆయ‌న బాగుంటునే ప్ర‌జ‌ల‌కు మంచి జ‌రుగుతుంద‌ని రామ‌చంద్ర‌శాస్త్రీ పేర్కొన్నారు. నిత్యం ప్ర‌జ‌ల్లో ఉండే వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హీరోగా భావిస్తున్నార‌ని చెప్పారు. క‌ల‌ర్‌ఫుల్ మ్యానిఫెస్టోలు చూసి మోస‌పోయామ‌ని ప్ర‌జ‌లు తెలుసుకున్నారని తెలిపారు. ప్ర‌భుత్వం మెప్పుపొందేందుకు అధికారులు అత్యుత్సాహం చూపుతున్నారని, ఆ క్ర‌మంలో వైయ‌స్ఆర్‌సీపీ నేత‌ల‌ను ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ అరెస్టులు చేస్తున్నారని వివ‌రించారు. ప్ర‌జా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అంద‌రు ఒక్క‌టి కావాలని, 2019లో వార్ వ‌న్‌సైట్ ఉంటుందని జోష్యం చెప్పారు. ప్ర‌జా వ్య‌తిరేక ప్ర‌భుత్వాలు ఎక్కువ కాలం ఉండవు. ప్యాన్ గుర్తుకే అధిక ఓట్లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిపారు. పార్టీలోకి  వ‌స్తున్న వ్య‌క్తులంద‌రిని క‌లుపుకొని పోవాల‌ని పంచాగ‌క‌ర్త రామ‌చంద్ర‌శాస్త్రీ  వైయ‌స్ జ‌గ‌న్‌కు సూచించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌స్తుంద‌ని, ఆ క్రెడిట్ వైయ‌స్ జ‌గ‌న్‌కే ద‌క్కుతుంద‌న్నారు. కొన్ని ఒడిదుడుకులు ఉన్నా అన్ని కూడా స‌మ‌సిపోతాయ‌ని చెప్పారు. పార్టీ నేత‌లు స‌యంమ‌నం పాటించాల‌ని, ప్ర‌తిప‌క్షానికి స‌మాన అవ‌కాశాలు క‌ల్పించాల‌ని భ‌గ‌వంతుడిని కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తెలుగు ప్ర‌జ‌లంద‌రికీ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌ట్టు శ్రీ‌కాంత్‌రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ల‌క్ష్మీపార్వ‌తి, కొండా రాఘ‌వ‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, నాయ‌కులు విజ‌య‌చంద‌ర్‌, చెల్లా మ‌ధు, త‌దిత‌రులు పాల్గొన్నారు
Back to Top