ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతు ఆత్మహత్యలు

వెలగపూడి: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు అందాల్సిన ఇన్‌పుట్‌ సబ్సీడీ, ఇన్సూరెన్స్‌లు అందక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. చంద్రబాబు సర్కార్‌ రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తయారైందని విమర్శించారు. రైతులను ఆత్మహత్యల బారినుంచి ఎలా కాపాడాలో ఆలోచించకుండా వ్యవసాయమే శుద్ధ దండగ అనే వైఖరిలో ప్రభుత్వం ఉందన్నారు. ఎన్నికల ముందు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కనీసం ఆ అప్పుల వడ్డీలు కూడా చెల్లించకపోతే రైతులు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వరు.. మీడియా పాయింట్‌ వద్ద కూడా మాట్లాడనివ్వకుండా అడ్డుతగులుతున్నారని ధ్వజమెత్తారు.

తాజా వీడియోలు

Back to Top