చెన్నైకి బ‌య‌ల్దేరిన వైయ‌స్సార్‌సీపీ నిజనిర్ధారణ కమిటీ

హైదరాబాద్:  చెన్నైలోని పాలంబూరులోని స‌దావ‌ర్తి స‌త్రం భూముల‌ను ప‌రిశీలించేందుకు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ఆదివారం చెన్నైకి బ‌య‌ల్దేరింది. ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు నేతృత్వంలో క‌మిటీ స‌భ్యులు చెన్నైకి వెళ్లారు. రాజ‌ధాని కి చేరువ‌లోని అమ‌రావ‌తి లోని స‌దావర్తి స‌త్రం కు చెందిన భూములు చెన్నైకు స‌మీపంలో ఉన్నాయి. కోట్ల రూపాయిల విలువ చేసే భూముల్ని తెలుగుదేశం నాయ‌కులు మాయ చేసి చేజిక్కించుకొన్నారు. ఈ కుంభ‌కోణంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయిల మేర అవినీతి జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీని మీద మాజీమంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అధ్య‌క్ష‌త‌న పార్టీ నాయ‌కుల‌తో క‌మిటీ ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికే అమ‌రావ‌తి వెళ్లి స‌దావ‌ర్తి స‌త్రాన్ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ ప‌రిశీలించింది.

Back to Top