వైయ‌స్సార్సీపీ త‌ర‌పున నిజ‌నిర్ధార‌ణ క‌మిటీ

హైద‌రాబాద్‌) స‌దావ‌ర్తి స‌త్రం భూముల గోల్ మాల్ వ్య‌వ‌హారంపై నిజానిజాలు రాబ‌ట్టి, భూరాబందుల చెర నుంచి దేవాదాయ భూమిని వెన‌క్కి విడిపించేందుకు వైయ‌స్సార్సీపీ త‌ర‌పున నిజ నిర్ధార‌ణ క‌మిటీ ఏర్పాటైంది. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద్ రావు అధ్య‌క్ష‌త‌న ఈ క‌మిటీ ఏర్పాటైంది. ఇందులో క్రిష్ణా, గుంటూరు జిల్లాల పార్టీ అధ్య‌క్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మ‌రియు నెల్లూరు జిల్లా పార్టీ అధ్య‌క్షులు స‌భ్యులుగా ఉంటారు. 
గుంటూరు జిల్లాలో రాజ‌ధానికి చేరువ‌లో ఉన్న అమ‌రావ‌తి ప‌ట్ట‌ణంలో అమ‌రేశ్వ‌ర స్వామి కొలువై ఉన్నారు. శ్రీ స్వామి వారి స‌న్నిధిలో సేవల కోసం అల‌నాడు జ‌మీందారులు దానంచేసిన భూములు పెద్ద సంఖ్య‌లో ఉన్నాయి. వీటిలో చెన్న‌య్ ను ఆనుకొని ఉన్న భూముల్లో దాదాపు 80 ఎక‌రాల భూమిని చౌక‌గా తెలుగుదేశం పెద్ద‌లు గ‌ద్ద‌లుగా మారి క‌బ‌ళించేశారు. ఈ కుంభ‌కోణం విలువ త‌క్కువ‌లో త‌క్కువ వెయ్యి కోట్ల రూపాయిలు ఉంటుందని అంచ‌నా. దీని మీద వైయ‌స్సార్సీపీ పోరాటం చేప‌ట్టింది. ఇందులో భాగంగా ఈ క‌మిటీని ఏర్పాటు చేయ‌టం జ‌రిగింది. 
Back to Top