ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు విష ప్ర‌చారం

వైయ‌స్ఆర్‌సీపీ లీగల్  సెల్  అధ్యక్షుడు మనోహర్  రెడ్డి  

తాడేప‌ల్లి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై ప్రతిపక్షాలు ప్రజలలో అపోహలు సృష్టించేందుకు విషప్రచారం చేస్తున్నాయ‌ని వైయ‌స్ఆర్‌సీపీ లీగల్  సెల్  అధ్యక్షుడు మనోహర్  రెడ్డి  మండిప‌డ్డారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

 •  
 • దేశంలో ఉన్న భూములకు సంబంధించి వివాదాలు,విబేధాలు తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది
 • ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ తో తయారుచేసి 2019లో అన్ని రాష్ట్రాలకు పంపింది.
 • దానిలో భాగంగా ల్యాండ్ టైట్లింగ్ తీసుకురావడానికి ముందు ఆంధ్రప్రదేశ్ లో భూ రీసర్వే జరపాలని నిర్ణయించారు.
 • ప్రధానంగా 100 ఏళ్ళ నాటి బ్రిటీష్ వాళ్ల కాలం నాటినుంచి సర్వేలలో ఉన్న రికార్డులను నేటి భూరీసర్వే ద్వారా మెరుగుపరిచారు.
 • భూముల సరిహద్దు వివాదాల వల్ల అనేక కేసులు కోర్టులలో వస్తున్నాయి.వివాదాలు క్రిమినల్ కేసులు దాకా వెళ్తున్నాయి.
 • జగన్ గారు సమస్యలను పరిష్కరించాలనే సదుధ్దేశ్యంతో దేశవ్యాప్తంగా ఎవ్వరూ తీసుకోని విధంగా భూసర్వేకు మన రాష్ర్టంలో నిర్ణయం తీసుకున్నారు.
 • రాష్ర్టంలో 6 వేల గ్రామాలలో సమగ్ర భూరీసర్వే జరిగింది.మిగిలిన గ్రామాలలో జరగాల్సి ఉంది.
 • డిజిటలైజేషన్ పద్ధతిలో భూయజమానులకు రికార్డులు ఇచ్చారు.
 • అన్ని గ్రామాలలో భూసర్వే పూర్తి అయ్యాకనే ఈ చట్టం అమలులోకి తెస్తారు.
 • కొంతమంది న్యాయవాదులు కోర్టులలో కేసులు వేస్తే ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది.దీనిని ఇప్పుడిప్పుడే మేం అమలులోకి తేవడం లేదు అని.
 • రెండేళ్ల తర్వాతనే అమలు చేస్తామని చట్టంపై అభ్యంతరాలు ఉంటే తెలియచేయమని కూడా అడిగింది.
 • ప్రతిపక్షనేతలు జగన్ భూములు లాక్కుంటాడని అబద్ధాలు చెబుతున్నారు.
 • సమగ్ర భూ రీసర్వే పూర్తి అయిన తర్వాత మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తాం అని ప్రభుత్వం చెబుతోంది.
 • భూ హక్కు దారుడుకి యూనిక్ కార్డు కూడా వస్తుంది.దాని వల్ల ఎంతో ప్రయోజనం ఉంది.
 • జిరాక్స్ కాపీలు ఇస్తారు.వరిజినల్ డాక్యుమెంట్స్ జగన్ గారి దగ్గర పెట్టుకుంటారంటూ అవాస్తవాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం దారుణం
 • వాటిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.
 • అసలు భూ స్కామ్ లకు పాల్పడింది చంద్రబాబు అండ్ కో నే అన్నారు.
 • అలాంటి స్కామ్ లకు చోటివ్వకూడదనే ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని తీసుకువస్తు్న్నాం.
   
Back to Top