రేపు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎన్నికల ప్ర‌చార షెడ్యూల్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఎన్నికల ప్రచార సభల మే 6 వ తేదీ షెడ్యూల్ ను పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శిల ర‌ఘురాం విడుద‌ల చేశారు. 6వ తేదీ  ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. సోమవారం   ఉదయం 10 గంటలకు  బాపట్ల  పార్లమెంట్ పరుధిలోని  రేపల్లె నియోజకవర్గం కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం  సెంటర్ లో  జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని మాచర్ల నియోజకవర్గ కేంద్రంలో ని శ్రీనివాస్ మహల్  సెంటర్ లో  జరిగే సభ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నం  పార్లమెంట్ పరిధిలో ని మచిలీపట్నం టౌన్ వల్లూరి రాజా  సెంటర్లో  జరిగే ప్రచార సభలో పాల్గొంటారు.

Back to Top