ప్రతి ఒక్క‌రు మొక్కలు నాటాలి

మంత్రాలయం:  ప్రతి ఒక్క‌రు మొక్కలు నాటాలని వైయ‌స్ఆర్‌సీపీ  మండల అధ్యక్షుడు జి.భీమిరెడ్డి సూచించారు. శనివారం మండల పరిధిలోని 52 బసాపురం గ్రామంలో ఫారెస్ట్‌ అధికారులు ఏర్పాటు చేసిన వనం–మనం కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హజరయ్యారు. ముందుగా గ్రామంలోని విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి పాఠశాలలో , ఇంటి ఆవరణలో తప్పకుండా మొక్కలను నాటాలన్నారు. మొక్కలను నాటడం వలన పర్యవరణాన్ని రక్షించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీట్‌ ఆఫీసర్‌ దేవి, అటవీశాఖ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top