ఎమ్మెల్యే వనిత ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్:

ప్రభుత్వం పెంచిన కరెంట్ చార్జీలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో విజయమ్మతో పాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగిన గోపాలపురం ఎమ్మెల్యే తానేటి వనిత శుక్రవారం రాత్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆదర్శ నగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సులో సత్యాగ్రహ దీక్ష వేదికపై నాలుగు రోజులుగా దీక్షలో ఉన్న ఆమె, చక్కెర స్థాయి ప్రమాదకరంగా పడిపోవడంతో రాత్రి 11.15 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు లోనై స్పృహ తప్పారు. పార్టీ కార్యకర్తలు హుటాహుటిన 108 అంబులెన్సుకు సమాచారమిచ్చి రప్పించారు. తొలుత మెడిసిటీ ఆస్పత్రికి తీసుకెళ్లి అనంతరం మెరుగైన చికిత్స కోసం నిమ్సుకు తరలించారు. వనిత కుప్పకూలిపోవడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వైయస్ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్తలు సత్యాగ్రహ వేదిక వద్ద పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ‘సీఎం డౌన్ డౌన్’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు రాత్రి 10.30 నుంచే దీక్షా శిబిరం వద్ద పోలీసు బలగాలను మోహరించారు. నిరాహార దీక్షలు చేస్తున్న నేతల ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఎమ్మెల్యేలు భూమా శోభా నాగిరెడ్డి, పేర్ని నాని, సుజయ కృష్ణ రంగారావులకు రక్తంలో చక్కెర శాతం ఆందోళనకర స్థాయికి పడిపోయింది. ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు బి. గురునాథరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, ఆకేపాటి అమరనాథరెడ్డిలకు బీపీ గణనీయంగా పడిపోరుుంది. విజయమ్మ తలనొప్పితో బాధపడుతున్నారు.

Back to Top