డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌కు వైయ‌స్ జగన్ నివాళులు


శ్రీ‌కాకుళం:  భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్ధంతి సందర్భంగా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కులు వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ఘనంగా నివాళ్లు అర్పించారు. దేశానికి డా.బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలు చిరస్మరణీయమ‌ని కొనియాడారు. సమాజంలోని అసమానతలు, సామాజిక రుగ్మతల నిర్మూలనకు కృషి చేసి అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయులు డా. బిఆర్ అంబేద్కర్ అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణ దాస్, మజ్జి శ్రీనివాస్ తమ్మినేని సీతారాం, రాజన్న దొర, కంబాల జోగులు, పుష్పశ్రీ వాణి, కళావతి తదితరులు పాల్గొన్నారు. అనంత‌రం జననేత 314వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం శ్రీ‌కాకుళం జిల్లా రెడ్డిపేట శివారు నుంచి ప్రారంభించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top