అవినీతికి కేరాఫ్ అడ్రస్ ఆమంత్రి

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో అవినీతికి కేంద్ర బిందువు రాష్ట్ర కార్మిక, క్రీడాశాఖ మంత్రి అచ్చెన్నాయుడేనని వైఎస్సార్సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత రెండు దశాబ్దాలుగా అచ్చెన్నాయుడు మద్యం వ్యాపారాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. జిల్లాలో ఆయన భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాడని ధర్మాన ఆరోపించారు. 

ఎక్సైజ్ అధికారుల బదిలీలు, ఎమ్మార్పీ ధరలు పెంచుకునేందుకు, బెల్టు షాపులు నిర్వహించుకునేందుకు మంత్రి లక్షల్లో వసూలు చేస్తున్నారని ధర్మాన తెలిపారు. జిల్లాలో 230 మద్యం దుకాణాలు ఉండగా ఒక్కొక్క షాపు నుంచి లక్షల్లో ముడుపులు దండుకుంటున్నారన్నారు.
Back to Top