ధర్మాపురం నుంచి ప్రారంభమైన షర్మిల యాత్ర

మహబూబ్‌నగర్: శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 48వ రోజు మంగళవారం ఉదయం మహబూబ్‌నగర్‌ జిల్లా ధర్మాపురం నుంచి ప్రారంభమైంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన అసమర్థ కిరణ్‌ ప్రభుత్వానికి, దాన్ని నిలదీసి దించేయకుండా పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న టిడిపి తీరుకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్నారు.

మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో కొనసాగుతున్న శ్రీమతి షర్మిల పాదయాత్ర బండమీదపల్లి చేరుకుంటారు. శ్రీమతి షర్మిల మంగళవారంనాడు మొత్తం 13.2 కిలోమీటర్లు నడవనున్నారు. బండమీదిపల్లి నుంచి హనుమాన్‌పూర్, మేనకా థియేట‌ర్ సెంట‌ర్ మీదుగా వ‌న్ టౌ‌న్ పోలీ‌స్ స్టేష‌న్ చౌరస్తా, అశో‌క్ థియేట‌ర్ నుంచి క్లా‌క్ టవ‌ర్, ‌పాత బస్టాండ్, డీఎస్పీ ఆఫీసు దారి నుంచి తెలంగాణ చౌరస్తా, బస్టాండు, న్యూ టౌ‌‌న్, ప్రభుత్వ ఆసుపత్రి, మెట్టుగడ్డ, పద్మావతి కాలనీ మీదుగా జేజేఆ‌ర్ గార్డె‌న్సు వరకూ శ్రీమతి షర్మిల పాదయాత్ర చేస్తారు.
Back to Top