ప్రస్తుతం ఉన్నది రాక్షస రాజ్యం

ఉదండ జగన్నాథపురం, ప్రత్తిపాడు 20 జూన్ 2013:

ప్రజా సమస్యలు పట్టని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఏమనాలని శ్రీమతి వైయస్ షర్మిల ప్రశ్నించారు. రాజన్న పథకాలకు తూట్లు పొడుస్తూ, చిన్నారుల ఆరోగ్యాన్ని సైతం ఫణంగా పెడుతున్న ఈ ప్రభుత్వం రాక్షస రాజ్యంతో సమానమని పేర్కొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని యు. జగన్నాధపురం గ్రామంలో శ్రీమతి షర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, రైతుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తమ కష్టాలు తీరాలంటే జగన్మోహన్ రెడ్డిగారు బయటకి రావాలని పలువురు అభిలషించారు. కరెంటు మూడు గంటలు కూడా రావడం లేదని రైతులు ఆమెకు ఫిర్యాదు చేశారు. విత్తనాలు, ఎరువుల జాడే లేదని చెప్పారు. పావలా వడ్డీ అని చెప్పి రూపాయి వసూలు చేస్తున్నారని మహిళలు తెలిపారు. ఇచ్చినప్పటికీ నకిలీ విత్తనాలు, ఎరువులేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని శ్రీమతి షర్మిల చెప్పారు.

రైతులకు నేనున్నానంటూ మహానేత అండగా నిలిచారని శ్రీమతి వైయస్ షర్మిల తెలిపారు. ఆయనకంటే ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా కరవు వచ్చి రాష్ట్రం అల్లాడిపోయిందన్నారు. రైతుల నుంచి బకాయిలు వసూలు చేయడానికి చంద్రబాబు ప్రత్యేక పోలీసు స్టేషన్లను ఏర్పాటుచేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు.  మగవాళ్ళు కనిపించకపోతే ఆడవారిని స్టేషన్లలో కూర్చోబెట్టేవారని తెలిపారు. ఈ విషయాలు గుర్తున్నాయా అని అడిగారు. డబ్బులేని కారణంగా ఎవరి చదువులూ ఆగిపోకూడదన్న రాజన్న ఆశయాలకు అనుగుణంగా  లక్షలాదిమంది విద్యార్థులు పెద్ద చదువులు చదివారన్నారు. పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంలో లక్షల విలువైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందుబాటులోకి తెచ్చారన్నారు. 12 సంవత్సరాల వరకూ పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించుకోవచ్చని రాజన్న చెబితే ప్రస్తుత ప్రభుత్వం దానిని రెండేళ్లకు కుదించిందన్నారు. ఇప్పుడున్నది రాజన్న ప్రభుత్వం కాదనీ.. ఆయన పథకాలకు తూట్లు పొడుస్తోందనీ ఆవేదన వ్యక్తంచేశారు. 75 లక్షల మందికి రాజన్న పింఛన్లు ఇచ్చారన్నారు. అంతకు ముందు చంద్రబాబు 17 లక్షల మందికి మాత్రమే ఇచ్చారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఉన్న పింఛన్లు కూడా ఎత్తేస్తోందనీ, దీనిని రాక్షస రాజ్యమనాలా.. ఏమనాలని ప్రశ్నించారు.

జగనన్న ఏ తప్పూ చేయలేదు
జగనన్న ఏ తప్పు చేయలేదు.. ఆయన తప్పకుండా బయటకొస్తారు.. ముఖ్యమంత్రి అవుతారు.. రాబోయే రాజన్న రాజ్యంలో అందరి కష్టాలూ తీరతాయని శ్రీమతి షర్మిల చెప్పారు. జగనన్న ముఖ్యమంత్రయిన తర్వాత పరిస్థితులు చక్కబడతాయన్నారు. మాట ఇచ్చారంటే ప్రాణం పోయినా నిలుపుకుంటారని తెలిపారు. మహిళలకు, రైతులకు వడ్డీ లేని రుణాలు ఇస్తారని స్పష్టంచేశారు. రోడ్ల సమస్య, కరెంటు సమస్యలాంటివి ఉండవన్నారు. అమ్మ ఒడి పధకం కింద ప్రతి నెలా అమ్మ బ్యాంకు ఖాతాలో సొమ్ము జమవుతుందనీ వాటితో పిల్లలను చదివించుకోవచ్చనీ వివరించారు. పింఛన్లు పెరుగుతాయి.. బియ్యం 30 కిలోలు ఇస్తారు.. బెల్టు షాపులుండవు.. నియోజకవర్గానికి ఒకే ఒక మద్యం దుకాణం ఉంటుందని తెలిపారు. రానున్న ఏ ఎన్నికలోనైనా మీరంతా కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధిచెప్పాలనీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనీ కోరారు. అందరూ జగన్మోహన్ రెడ్డిగారినీ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని శ్రీమతి షర్మిల ప్రజలను కోరారు.

Back to Top