టీడీపీలో ఓటమి భయం

నంద్యాలః మూడేళ్లలో నంద్యాలను పట్టించుకోని చంద్రబాబు ఉపఎన్నిక రాగానే నెలన్నర కాలంలో రూ. 2వేల కోట్ల జీవోలిచ్చాడు. బాబును ప్రజలు నమ్మడం లేదు.  క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే జగన్ బహిరంగ సభ తర్వాత టీడీపీలో ఓటమి  భయం నెలకొంది. బాబు వీధికో మంత్రిని మోహరించాడు. డబ్బుల మూటలతో ప్రజలను కొనే ఆలోచనతో తిరుగుతున్నారు. డబ్బులు తీసుకొని ఓటేసే కాలం పోయింది. ప్రజలు వారి మనసుకు నచ్చినవారికి ఓటు వేస్తారు. వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మిథున్ రెడ్డి అన్నారు.  

వైయస్సార్సీపీ విప్, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
చంద్రబాబు మంత్రులను నంద్యాలలో పెట్టి జగన్, శిల్పాల గురించి గోబెల్స్ ప్రచారం చేసి, డబ్బులతో గెలవాలని చూస్తున్నాడు. ఆయన కుట్రలు చెల్లవు.  శిల్పా స్వచ్ఛంద వాటర్ కార్యక్రమం, రుణాలివ్వడంలాంటి  మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. 2014లో నా హామీలు నమ్మి ఓట్లేశారన్న భ్రమలో బాబు ఉన్నాడు.  ప్రజలు మంచి తీర్పు ఇవ్వబోతున్నారు. వైయస్ఆర్ కుటుంబంపై అపారమైన అభిమానం నంద్యాల ప్రజలకు ఉంది. బాబు మోసం చేస్తున్నాడని ఎన్నికలప్పుడు వైయస్ జగన్ ఏవిధంగా చెప్పారో అదే జరిగింది.  మహిళలు వచ్చి వైయస్ జగన్ కు సమస్యలు చెప్పుకుంటున్నారు. మూడేళ్లలో ఏ అభివృద్ధి చేయని బాబు మంత్రులు, అధికారులను పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తున్నాడు. శిల్పా మోహన్ రెడ్డి గెలుపు ఖాయం.
Back to Top