భోగాపురం కు ముంచుకొస్తున్న ముప్పు

హైదరాబాద్) విజయనగరం జిల్లా
భోగాపురం చుట్టుపక్కల ప్రాంతాల రైతుల గుండెల్లో గుబులు రేగుతోంది. అంతర్జాతీయ
ఎయిర్ పోర్టు కోసం భూముల సేకరణ  మార్చి
నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా కలెక్టర్ కు ఈ
మేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో స్థానిక రైతులు అల్లాడిపోతున్నారు. రైతుల తరపున ప్రతిపక్ష వైెఎస్సార్సీపీ పోరాటం చేస్తోంది. ప్రజల గొంతు వినేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని తాజా ఆదేశాలతో స్పష్టం అయింది. ఇంటర్నేషనల్
ఎయిర్ పోర్టు పేరుతో మొదటి దశగా 5 వేల ఎకరాల మేర భూములు లాక్కోవాలని ప్రభుత్వం
సంకల్పించింది. ఇది మొదటి దశ మాత్రమేనని, తర్వాత కాలంలో ఇది మరింత పెరగవచ్చని
ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

Back to Top