వైయస్సార్ జిల్లా: రెండేళ్ల అవినీతి పరిపాలనతో ప్రజలను వంచించిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై చట్టపరంగా చర్య తీసుకోవాలని కోరుతూ వైయస్సార్సీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేస్తున్నారు. వైయస్సార్ జిల్లా రాజంపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకెపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఊరేగింపుగా వెళ్లి పోలీస్ స్టేషన్లో చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు. సీఐ, ఎస్‌ఐ లేకపోవడంతో హెడ్‌కానిస్టేబుల్‌కు ఫిర్యాదుపత్రం అందజేశారు. అలాగే కమలాపురం, ప్రొద్దుటూరు, కడప తదితర ప్రాంతాల్లో కూడా వైయస్సార్ నేతలు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుచేశారు.<br/>