రోజాకు ఏమైనా జరిగితే బాబుదే బాధ్యత

హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాకు ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిదే బాధ్యత అని ఆ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు.  ఓ మహిళ ఎమ్మెల్యే ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేక చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. అధికారముందని ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారని, ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. 

శాసనసభలో ముఖ్యమంత్రి సమక్షంలోనే అధికార పార్టీ సభ్యులు విలువలు వదిలేసి దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అధికారపార్టీ సభ్యులు తిడుతూ నీచమైన వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబు సంతోషంతో నవ్వుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను అణగదొక్కేందుకు చంద్రబాబు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారని చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఫైరయ్యారు.

తాజా ఫోటోలు

Back to Top