నిరసనలు, ఉద్యమాలపై ఉక్కుపాదం..!

ప్రత్యేకహోదాను నీరుగార్చే కుట్ర..!
విద్యార్థులను అదుపులో పెట్టాలని యూనివర్సిటీలు,కాలేజీలకు ఆదేశాలు..!
ప్రభుత్వ నిర్ణయంపై భగ్గుమంటున్న విద్యార్థిసంఘాలు..!
ఆంధ్రప్రదేశ్ః  క్రమశిక్షణ తదితర కారణాలతో యూనివర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థులపై ఉక్కుపాదం మోపేందుకు చంద్రబాబు కుట్రపన్నుతున్నారు. ప్రత్యేకహోదా సాధన కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కు విద్యార్థులు మద్దతుగా నిలుస్తుండడంతోనే ఈదుశ్చర్యకు పాల్పడుతున్నారు. నిరసనలు, ఉద్యమాల్లో పాల్గొనకుండా విద్యార్థులను కట్టడి చేయాలంటూ యూనివర్సిటీలు, కాలేజీలను ఆదేశిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థిసంఘాలు భగ్గుమంటున్నాయి. 

కుట్రల మీద కుట్రలు..!
వైఎస్ జగన్ కు వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక చంద్రబాబు ఈకొత్త ఎత్తుగడ వేస్తున్నారు. వైఎస్ జగన్ పోరాటాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు చేయని కుట్రలు లేవు. తిరుపతి, వైజాగ్ లో యువభేరి సదస్సులు నిర్వహించరాదంటూ అనుమతులు నిరాకరించడం మొదలు గుంటూరులో దీక్షను అడ్డుకునేవరకు చంద్రబాబు అన్నీ కుట్రలే చేశారు. యువభేరికి రాకుండా విద్యార్థులను అడ్డుకునేందుకు ఎన్ని కుయుక్తులు పన్నినా పాచిక పారలేదు. వేలాదిగా విద్యార్థులు యువభేరికి తరలివచ్చి వైఎస్ జగన్ కు బాసటగా నిలిచారు. దీంతో,  అక్కసుతో సదస్సులో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ ను సస్పెండ్ చేసి తమ కుటిలబుద్ధిని చాటుకున్నారు. 

ప్రభుత్వంపై మండిపడుతున్న విద్యార్థిలోకం..!
ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు  చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...కొత్త ఉద్యోగాలేమో గానీ ఉన్న ఉద్యోగాలను పీకేస్తున్నారు. రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఆఊసేలేదు. ప్రియతమ నేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్ మెంటు పథకాన్నినిర్లక్ష్యం చేశారు. విద్యార్థులకు బకాయిలు అందకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి తీసుకొస్తున్న పరిస్థితి. దీనికి తోడు ర్యాగింగ్ వేధింపులు, ప్రైవేటు సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలు. ఇలా ఏడాదిన్నర అవుతున్నా ఇంతవరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. దీంతో, ప్రభుత్వంపై విద్యార్థుల్లో అశాంతి, ఆగ్రహం పెల్లుబికింది. ఆందోళనలు, ఉద్యమాలతో తిరగబడతారని పచ్చనేతలు వణుకుతున్నారు.   

చంద్రబాబును ఛీదరించుకుంచున్న ప్రజలు..!
ప్రత్యేకహోదా వస్తే తమ జీవితాలు బాగుపడుతాయని భావించి విద్యార్థులు వైఎస్ జగన్ ఆధ్వర్యంలో పోరాడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా జననేత కోసం విద్యార్థిలోకం కదం తొక్కుతోంది. ఈక్రమంలోనే అక్టోబర్ 7 నుంచి వైఎస్ జగన్ చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్షకు సిద్ధమవుతుండడంతో  పచ్చప్రభుత్వం మరో అరాచకానికి స్కెచ్ వేసింది. విద్యార్థులను అడ్డుకోవాలన్న దురుద్దేశ్యంతో  అదుపులో పెట్టాలంటూ విద్యాసంస్థల ప్రిన్సిపల్స్, యాజామాన్యాలకు ఆర్డర్ వేస్తోంది. నిరసనలను అడ్డుకోవడం, ప్రత్యేకహోదా ఉద్యమాలను అణచివేసేందుకు చంద్రబాబు పన్నుతున్న పన్నాగంపై రాష్ట్ర ప్రజానీమంతా చీధరించుకుంటుంది. 
Back to Top