చంద్రబాబు దృతరాష్ట్ర పాలన

డాబాగార్డెన్స్‌: ముఖ్యమంత్రి చంద్రబాబుకు, టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సంస్కారమే లేదని వైయస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు విమర్శించారు. సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రతిపక్ష నేత అంతు చూస్తానన్న మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయినా కనీసం వారి కుటుంబాలను పరామర్శించని సంస్కారం టీడీపీదని ఎద్దేవ చేశారు. చంద్రబాబు కళ్లు ఉన్న దృతరాష్ట్ర పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దివంగత మహానేత వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి ఆలోచన అంతా బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలపైన ఉండేదని, చంద్రబాబు మైండ్‌సెట్‌ అందుకు విరుద్ధమన్నారు.పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత స్థాయిని మరచి ప్రతిపక్ష నేతపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఎమ్మెల్యే అయిన వెంటనే గాలిలో చక్కెర్లు కొడుతూ నియోజకవర్గాన్ని గాలికొదిలేశారని ఆక్షేపించారు. 

తాజా ఫోటోలు

Back to Top