చేతిలో బాండ్లు... చెవిలో పూలు!

రుణ మాఫీపై మాటతప్పిన చంద్రబాబు
ఓట్లేసిన రైతులు, మహిళలను నట్టేట ముంచారు
ఊహల పల్లకిలో ఊరేగించి కిందపడేశారు
ఎప్పట్లాగే మాట తప్పిన వైనం


హైదరాబాద్: రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, పింఛన్ల పెంపు ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలతో మారిన మనిషిగా మీ ముందుకు వస్తున్నా... ఈ ఎన్నికల్లో నన్ను గెలిపించండి..! -ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు.
‘నేనా.. అలా అన్నానా..? ఎప్పుడు..? రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉంది. రుణమాఫీకి ఆర్‌బీఐ వ్యతిరేకంగా ఉంది. అర్హులకే ఇస్తాం. దీనిపై కోటయ్య కమిటీ వేస్తాం..! - ఎన్నికల ముగిశాక సీఎం చంద్రబాబు నాయుడు
పతి రైతన్న ఇంట ఆనంద శోభావళి
రుణ విముక్తితో నేడే అసలైన దీపావళి
అంటూ.. రైతు సాధికార సంస్థ ప్రారంభోత్సవం రోజు
చంద్రబాబు ప్రభుత్వం దినపత్రికల్లో ఇచ్చిన ప్రకటన
ఆయన ఆ కార్యక్రమంలో ఇంకా ఏమన్నారంటే..!
1. గతంలో ఎరువులు, విత్తనాల సమస్యలు ఉండేవి. ఈ సారి సమస్య లేదు.
2. మహిళలూ.. బ్యాంకులకు వడ్డీ కట్టకండి. వడ్డీ ఎంతైనా ప్రభుత్వం భరిస్తుంది.
3. తుదిశ్వాస ఉన్నంత వరకు రైతులు, మహిళల కోసం కృషి చేస్తా
4. చక్కెర ఎక్కువ తినకండి..తింటే షుగర్ వస్తుంది.
5. కార్పొరేషన్ ప్రారంభించడం నా పూర్వ జన్మ సుకృతం
6. రైతు రుణమాఫీ విషయంలో ఎవరికీ అపోహలొద్దు..
‘ప్రభుత్వంపై ఎలాంటి అనుమానాలొద్దు..
 రైతులను, డ్వాక్రా మహిళలను తప్పకుండా ఆదుకుంటా..
 రైతులను రుణవిముక్తం చేస్తున్నా.. ఇది నా భాగ్యంగా భావిస్తున్నా..’
 7. వ్యవసాయ రంగంలో ఈ కామర్స్ విధానాన్ని ప్రవేశ పెడతాం. ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్రారంభిస్తాం. పొలం మీద నుంచి రైతు తన పంటను అమ్ముకోవచ్చు. పంట దిగుబడి వివరాల్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయవచ్చు.

ఈ ప్రశ్నలకు బదులేది?
సీమాంధ్రలోని 13 జిల్లాల్లో 2014 మార్చి చివరి నాటికి రూ.87వేల కోట్లు ఉన్నాయి. వాటిలో ఎన్ని వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు? ఎన్ని వేల కోట్ల రూపాయలను కొత్తగా బ్యాంకుల ద్వారా అందజేశారు? రుణాల చెల్లింపు విషయంలో మీరు చేసిన ఆలస్యం వల్ల పెనాల్టీ కింద రూ.పన్నెండున్నర వేల కోట్లు చెల్లించాల్సి వచ్చిందన్న వాస్తవాన్ని ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా..?  మీరు మరో 7 నెలలలోపు రైతు రుణాలన్నీ మాఫీ చేయకపోతే మరో రూ.14 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందన్న విషయం ప్రజలకు వివరించగలరా?

ఇన్ని తెలిసి కూడా అధికారంలోకి వచ్చిన 5 నెలల తరువాత కూడా వ్యవసాయ రుణాలలో ఒక్క రూపాయిని కూడా రద్దు చేయలేదని ఒప్పుకోండి. వ్యవసాయ రుణాలే రూ.లక్ష కోట్లకు చేరుకుంటే.. కేవలం రూ.5 వేల కోట్లతో రూపాయలతో రైతు సాధికారత సంస్థ ప్రారంభించి జనాలను మభ్యపెడుతున్నామని అంగీకరిస్తారా? రైతులు చెల్లించాల్సిన వడ్డీలే రూ.25 వేల కోట్లకు చేరుతున్నపుడు కేవలం రూ.5 వేల కోట్లతో మొత్తం రుణమాఫీ చేసేశానని ప్రజలను పండగ చే సుకోమని చెబుతున్న మిమ్మల్ని ఏమనాలి?
4. ఇక డ్వాక్రా రుణాలు రూ.14 వేల కోట్లు ఉన్నాయి. ఇంతవరకూ రుపాయి కూడా మాఫీకాలేదు.
5. రాష్ట్రంలో విత్తన, ఎరువుల కొరత లేదని వింత ప్రకటన చేశారు. బ్యాంకులు పాత రుణాలు మాఫీ చేయలేదు. కొత్తరుణాలు ఇవ్వడం లేదు. ఇక రైతు ఏం పెట్టి ఎరువులు, విత్తనాలు కొంటాడు? 1994-2004 వరకు పాలించిన మీరు కరెంటుఛార్జీలు ఎందుకు పెంచారని అడిగితే ప్రజలపై కాల్పులు జరిపించారు. ఇక ఇప్పడు యూనిట్ ఛార్జి రూ.20లు చేశారనుకోండి. ఇక సామాన్యుడు కనీసం ఫ్యాను వేసుకోడు. కరెంటు వాడటానికే జనం జంకేస్థితికి తీసుకువచ్చారు. అప్పడు కూడా మిగులు విద్యుత్తు ఉందని సొంత డబ్బా కొట్టుకునేందుకు వెనకాడరు.
6. మీరు మారలేదని మాట నిలబెట్టుకున్నారు.. 15 ఏళ్ల క్రితమే వ్యవసాయం దండగని చెప్పిన మీరు.. ఇప్పడు సీమాంధ్రలో రైతుల భూములు లాక్కుంటూ వ్యవసాయాన్ని లేకుండా చేయడానికి కంకణం కట్టుకున్నట్లుంది.
7. మీ ఘనకార్యం వల్ల బీమా డబ్బులు కూడా మీ ఖజానాలో వేసుకోవడం వల్ల తుఫాన్ బారిన పడ్డ ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల రైతులు బీమాను కూడా
 కోల్పోవాల్సి వచ్చింది. ప్రీమియం గడువు పొడగించినా ఫలితం లేకుండా పోయింది. ప్రీమియం లేకుండా బీమా ఎలా వస్తుంది? దీనికేం సమాధానం చెబుతారు?
8. ఇక స్వయం సహాయక బృందాల విషయానికి వస్తే.. విలేకరుల సమావేశంలో చంద్రబాబు ఏమన్నారంటే.. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7,60,000 స్వయం సహాయక లేదా డ్వాక్రా బృందాలు ఉన్నాయని, ఒక్కో గ్రూపునకు గరిష్టంగా రూ.లక్ష మాత్రమే మాఫీ చేస్తానని చెప్పారు. అంటే ఎస్‌ఎల్బీసీ రిపోర్టులో రూ,14,204 కోట్లు ఎస్‌హెచ్‌జీ రుణాలు రుణమాఫీని రుణమాఫీని పరిమితం చేస్తానంటున్నాడు. దీనర్థం రూ.5 వేల కోట్లురుణాలు చేస్తాడని కాదు.‘చేయవచ్చు’ అన్న ఆశను ఇంకా బతికే ఉంచుతున్నాడు. మరికొంతకాలం ప్రజల్ని మభ్యపెట్టేందుకే ఈ ఎత్తుగడ. రుణమాఫీని కేవలం రూ.లక్షకు పరిమితం చేస్తానని మాటమార్చిన మోసకారిని బాబును ఏమనాలి?
2014, జూన్ 8న చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేరోజున కొన్ని దినపత్రికల్లో సమాచార పౌర సంబంధాల శాఖ, ఆంధ్రప్రదేశ్ వారు పూర్తిపేజీ ప్రకటన జారీచేశారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఈ ప్రకటనలో చంద్రబాబు చేసిన మొదటి వాగ్దానం రైతుల రుణమాఫీ, రెండోది డ్వాక్రా రుణాల మాఫీ.

అక్టోబరు 2, 2012లో అనంతపురంలో పాదయాత్ర సందర్భంగా తొలిసారిగా రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించారు. అప్పటికి ఉమ్మడి రాష్ట్రంలో రైతు రుణాలు రూ.1.27 లక్షల కోట్లు అని అప్పటి ఎస్‌ఎల్బీసీ 181 పేర్కొంది.
‘జగన్ గారికి అనుభవం,ఆలోచన లేవు. ఆ రెండూ నాకున్నాయి. ఎకనామిక్స్‌లో ఎం.ఏ పట్టా తీసుకున్నా. రైతు రుణమాఫీ చేసి చూపిస్తా’నని ప్రగల్బాలు పలికిని సంగతి మర్చిపోయారా?
ఎన్నికల సంఘం రుణమాఫీ ఎలా సాధ్యమని నోటీసు ఇస్తే.. రాష్ట్రంలోని వనరుల్ని వాడుకుని ఆదాయం పెంచుకుని మాఫీ చేస్తానని సమాధానం ఇచ్చింది మీరు కాదా?
ఆంధ్రప్రదేశ్‌కు ఒకటి, తెలంగాణకు ఒకటి మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఊరూరా తిరిగారు. రైతు రుణాలు, బంగారురుణాలు అన్నీ మాఫీ చేస్తానని సైకిల్ గుర్తుకు ఓటేయించుకున్నారు.
తొలిసంతకం రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల రద్దు మీదే అని వాగ్దానం చేశారు. టీవీ చానళ్లల్లో, సినిమా థియేటర్లలో ప్రకటనలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చారు.. చివరికి ఇప్పడు మీరు ఏం చేస్తున్నారు?

తొలి సంతకం పెట్టారా.. అంటే పెట్టారు..?
రుణమాఫీ మీద కాదు కోటయ్య కమిటీ మీద పెట్టారు..
కోటయ్య కమిటీ రిపోర్టు రాగానే మాఫీ ఖాయం అన్నారు.
కోటయ్య కమిటీ రిపోర్టు వచ్చింది... కోటయ్య కమిటీ చెప్పినదానికన్నా ఉదారంగా రూ.లక్షన్నర మాఫీ చేస్తానని ప్రకటించారు.. ఇచ్చారా..?
ఎంతమందికి ఇచ్చారు.. అసలు అమలైందా?
పండుగలు చేశారు..సన్మానాలు చేయించుకున్నారు. భారీగా ప్రకటనలు ఇచ్చుకున్నారు. ఒక్కపైసా రుణం కూడా మాఫీ కాకుండా ఇంత హంగామా చేస్తున్న మిమ్మల్ని ఏమనాలి?

 ఆ తరువాత రూ. లక్షన్నర కుటుంబంలో ఒకరికే అన్నారు.
 కుటుంబం అంటే నిర్వచనం ఏంటో ఇంతవరకు చెప్పలేదు.
 కుటుంబంలో ముగ్గురికి రుణాలు ఉంటే ఒకరికి పోతుంది.
 ఆ ఒక్కరు ఎవరో ఇంతవరకూ వాళ్లకు తెలియదు.
 మీకు తెలియదు.. బ్యాంకువాళ్లకు అసలు తెలియదు..
 రుణాలు కట్టవద్దని పిలుపునిచ్చారు.. ఈ ముగ్గురూ కట్టకూడదా?
 ఈ ముగ్గురిలో ఒక్కరే కట్టకూడదా?
 ఒక్కరే అయితే ఎవరా ఒక్కరు?
 ఈ ప్రశ్నలకు బదులేది?

 తరువాత ఏం అంటున్నారు?
 ఆర్బీఐ సహకరించడం లేదు అంటున్నారు..
 కేంద్రం మోకాలడ్డిందని చెబుతున్నారుు..
 అయినా నేను రుణమాఫీ చేస్తానని మభ్యపెడుతున్నారు.
 ఎలా చేస్తారో సహేతుకమైన సమాధానం చెప్పరు.
 చేస్తాం అని బుకాయిస్తారు.. చెయ్యరు..!
 ఇప్పడు మరో కొత్తనాటకానికి తెరతీశారు.
 దీపావళికి రైతు సాధికారత కార్పొరేషన్ ప్రారంభించారట..
 అదిబాండ్లు ఇష్యూ చేస్తుందట..
 అవి రైతులకు ఇస్తారట..
 దాన్ని చూసి రైతులంతా సంతోషపడాలట..
 ఇకపై సాధికార సంస్థ మీద చంద్రబాబు ఫైర్ అంటూ వార్తలు రాయించుకుంటారు అవునా..?
 + చేతిలో బాండ్లు చెవిలో పువ్వులు..!
 గుర్రానికి పచ్చగడ్డి కట్టి లాగినట్లు రైతులను ఊహలపల్లకిలో తృప్తి పడమంటున్నారు.. ఇదేనా మీ విశ్వసనీయత..?
 17. రుణమాఫీలో 20 శాతం ఈ ఏడాది మిగిలినది వచ్చే 5 ఏళ్లలో చేస్తారని చెప్పటమంటే విజన్ 2020 అంటే ఇదేనా?
Back to Top