కేంద్ర, రాష్ట్రాల్లోని పాలకులు ఎపిని మోసం చేశారు

రాష్ట్రానికి
అన్యాయం చేసిన పాలకులకు 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు కచ్చితమైన గుణపాఠం చెపుతారని
వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  రాష్ట్ర విభజన అనంతర పరిస్థితులపై శనివారం ఆయన
ఒక ట్వీట్ చేశారు.

 రాష్ట్ర విభజన
జరిగి నాలుగేళ్లు అవుతున్నా, ఆంధ్రప్రదేశ్ కు   న్యాయం
జరగలేదు. కేంద్ర, రాష్ట్రాల్లో ఉన్న పాలకులు ఏపీని మోసం చేశారు. న్యాయంగా
రావాల్సిన ప్రత్యేక హోదాను తిరస్కరిస్తూ , రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు తూట్లు
పొడిచారని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.  పాలకులు చేసిన మోసానికి 2019 ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా బుద్ధి చెపుతారన్నారని
అన్నారు. 

Back to Top