కోల్‌కతా, లక్నో పర్యటనకు జగన్‌కు అనుమతి

హైదరాబాద్, 19 నవంబర్ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధినేత, కడప ఎంపీ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కోల్కతా, లక్నో వెళ్లేందుకు ‌సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం అనుమతి ఇచ్చింది. నాంపల్లిలోని సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో శ్రీ జగన్ ‌బుధవారంనాడు కోల్కతా వెళతారు. తృణమూ‌ల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగా‌ల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని‌ ఆయన కలుస్తారు. అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్లోని లక్నో వెళతారు. అక్కడ  సమా‌జ్‌వాది పార్టీ అధ్యక్షుడు మూలాయం సింగ్ యాద‌వ్ను, ఉత్తర‌ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలే‌శ్ యాద‌వ్ను కలుస్తారు.

‌ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ జాతీయ నాయకులను కలిసి మద్దతు కూడగడుతున్న క్రమంలో శ్రీ జగన్ ‌ఈ ముగ్గురునీ కలుస్తారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలను శ్రీ జగన్ వారికి వివరిస్తారు. పార్లమెంటులో విభజన బిల్లును వ్యతిరేకించాలని వారిని కోరతారు.

Back to Top