తెలుగువారి మనోభావాలు దెబ్బతీస్తే సహించం

హైదరాబాద్, 26 హైదరాబాద్ 2013 :

తెలుగువారి మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ఎదుర్కొంటుందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ సిఎల్పీ ఉప నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డి హెచ్చరించారు. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో‌ పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని శోభా నాగిరెడ్డి ప్రకటించారు. ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం సభలో ఆమె మాట్లాడుతూ ప్రజలంతా శ్రీ జగన్తో ఉన్నారని తెలిపారు.‌ శ్రీ జగన్ ఆలోచనల నిండా ప్రజలే ఉన్నారన్నారు.

శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనకు పూనుకు‌న్నదని శోభా నాగిరెడ్డి అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు సోనియా గాంధీ విభజన నిర్ణయం తీసుకుంటే వ్యతిరేకించింది‌ శ్రీ జగన్ ఒక్కరేనని గుర్తుచేశారు. సోనియాతో చంద్రబాబు చేతులు కలిపి విభజన అనుకూలంగా లేఖ ఇచ్చారని ఆరోపించారు.

తాజా ఫోటోలు

Back to Top