వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ సభకు అనుమతి ఇవ్వాలి

హైదరాబాద్‌ :

హైదరాబాద్లో‌ ఈ నెల 19న వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని ‌సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు తీవ్రంగా ఖండించారు. భావ ప్రకటన స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన గుర్తుచేశారు. గతంలో సమైక్యవాదుల సభలకు, తెలంగాణవాదుల సభలకు అనుమతిచ్చారు కదా అని ప్రశ్నించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమైక్య సభకు అనుమతిపై పోలీసులు నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని రాఘవులు సూచించారు.‌ ఎవరి భావ ప్రకటనా స్వేచ్ఛనూ అడ్డుకునే హక్కు ఎవరకీ లేదన్నారు. సిపిఎం సమైక్య వాదానికి అనుకూలమని, అందుకోసం ఎవరు పోరాడినా తప్పకుండా మద్దతు ఇస్తామని రాఘవులు తెలిపారు.

Back to Top