సత్యదేవుని దర్శించిన పీఏసీ ఛైర్మన్ బుగ్గన

అన్నవరం: ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్, డోన్ శాసనసభ్యుడు బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి గురువారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించి ప్ర‌త్యేక‌ పూజలు చేశారు. తుని శాసనసభ్యుడు దాడిశెట్టి రాజా, వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త పర్వత పూర్ణచంద్రప్రసాద్‌లతో కలిసి బుగ్గ‌న‌ స్వామివారి ఆలయానికి విచ్చేసారు. వారికి పండితులు ఆలయమర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంత‌రం తీర్థ‌ప్ర‌సాదాలు అందించారు. 
Back to Top