బంగారం బ్యాంక్‌లోనే.. బతుకులు రోడ్డు మీదకు

శ్రీకాకుళం: ప్రభుత్వం నుంచి సాయం అందక గిట్టుబాటు కాని కూలీతో ఇబ్బందులు పడుతున్నామని ఇటుక బట్టీ కార్మికులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. రాజాం నియోజకవర్గం రేగడి మండలంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఇటుక బట్టీ కార్మికులు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలను జననేతకు వివరించారు. వైయస్‌ జగన్‌ ఇటుకలు తయారు చేసి కార్మికుల కష్టాలు తెలుసుకున్నారు. కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామని జననేత వారికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఇటుక బట్టీ కూలీలు మీడియాతో మాట్లాడుతూ.. మొదట్లో వ్యవసాయం చేసే వారిమని పెట్టిబడి కోసం బంగారం తాకట్టు పెట్టామని చెప్పారు. చంద్రబాబు తనను గెలిపిస్తే బ్యాంకుల్లో ఉన్న బంగారం ఇంటికి వస్తుందని చెప్పాడని, కానీ ఇప్పటి వరకు బంగారం బ్యాంక్‌లోనే ఉంది.. బతుకులు రోడ్డు మీదకు వచ్చాయని మండిపడ్డారు. చాలా మంది రైతులు కుటుంబాన్ని పోషించేందుకు ఇటుకబట్టీ కూలీలుగా మారరన్నారు. ఇటుక బట్టీల నిర్వాహణకు ప్రభుత్వం నుంచి కావాలని, సబ్సిడీ లోన్‌లు, యంత్రాలకు 90 శాతం సబ్సిడీ ఇస్తే కూలీల జీవన విధానాలు మెరుగుపడతాయన్నారు. 
Back to Top