టీడీపీ ఎమ్మెల్యే బోండ ఉమా భూ కబ్జా

విజయవాడ: అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతలు సాగిస్తున్న అరాచకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయి.  బెజవాడలో మరో భూకబ్జా బాగోతం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనుచరులు భూకబ్జాకు పాల్పడ్డారు. దుర్గాపురంలో ఎమ్మెల్యే ఉమా పేరుతో ఇల్లును కబ్జా చేశారు. యజమాని ఇంట్లోకి రాకుండా బోండా అనుచరులు దౌర్జన్యానికి దిగారు.

అంతేకాకుండా ఏమైనా మాట్లాడుకోవాలంటే ఎమ్మెల్యే కార్యాలయానికి రావాలని, అక్కడకు వచ్చి సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని వార్నింగ్‌ ఇచ్చారు. కాగా క్యాన్సర్‌తో బాధపడుతున్న కూతురితో రాత్రాంతా ఇంటి యజమాని ఆందోళన కొనసాగించాడు. తన కూతురికి ఏదైనా జరిగితే ఎమ్మెల్యే ఉమ బాధ్యత వహించాలని అతడు ఆవేదన వ్యక్తం చేశాడు.
Back to Top