ఉద్యోగభద్రత లేదన్నా..

విశాఖః తమకు ఉద్యోగ
భద్రత లేదని, వేతనాలు సరిగ్గా అందడంలేదని బిహెచ్‌ఈఎల్‌ కార్మికులు వైయస్‌ జగన్‌ మోహన్
రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. విశాఖ నగరంలో పాదయాత్ర చేస్తున్న జననేతను కలుసుకుని
తమ సమస్యలను వివరించారు. దాదాపు 25 ఏళ్ల నుంచి
పనిచేస్తున్న ఉద్యోగభద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో ప్రకారం సెంట్రల్‌
గవర్నమెంట్‌ జీతాలు రావాలని స్టేట్‌ గవర్నమెంట్‌ జీతాలు ఇస్తున్నారన్నారు.  చాలీచాలని జీతాలతో కుటుంబపోషణ ఇబ్బందికరంగా మారిందన్నారు. బిహెచ్‌ఎల్‌
మూసివేత సమయంలో దివంగత వైయస్‌రాజశేఖర్‌ రెడ్డి ఆదుకున్నారన్నారు. ఆయన బతికుంటే
మాకు న్యాయం జరిగేందన్నారు. 
రాజన్న బిడ్డ జగన్‌ అధికారంలోకి వస్తే
మాకు అండగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Back to Top