బెయిల్ రాకుండా కుట్రలు

కడప:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి  బెయిల్ రాకుండా కుట్రలు పన్నుతున్నారని  పార్టీ కడప జిల్లా కన్వీనర్ కె. సురేష్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ‘జగన్ కోసం జనం సంతకం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. శ్రీ వైయస్ జగన్‌కు బెయిలు ఇవ్వాలని కోరుతూ  పార్టీ కార్యాలయంలో - ఏర్పాటు చేసిన కోటి సంతకాల కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు వైయస్ అవినాశ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్‌బాబు మాట్లాడుతూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గత రెండేళ్లలో ఎన్నో అద్బుత విజయాలు సాధించిందన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా బయట ఉంటే తమకు ఉనికి ఉండదని కాంగ్రెస్, టీడీపీ కుట్రలు పన్ని ఆయనను జైలులో పెట్టారన్నారు. ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి పంపుతామన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డికి బెయిలు రాకుండా చేసేందుకు కాంగ్రెస్, టీడీపీ కోర్టులను ప్రభావితం చేసేలా కుట్రలు పన్నుతున్నాయని ఎమ్మెల్సీ నారాయణరెడ్డి ధ్వజమెత్తారు. సీబీఐకి భయపడే ములాయంసింగ్ యాదవ్, మాయావతి వంటి వారు యూపీఏకు మద్దతిస్తున్నారని తెలిపారు.
     పదేపదే శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని పార్టీ విద్యార్థి విభాగం నాయకులు సుధీర్ కుమార్‌రెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డికి బెయిల్‌రాకపోవడం అన్యాయమని పార్టీ రాష్ట్ర యూత్ స్టీరింగ్ కమిటీ సభ్యులు మరకా శివకృష్ణారెడ్డి తెలిపారు.

Back to Top