బంద్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలి : విశ్వేశ్వరరెడ్డి

అనంతపురం‌, 30 ఆగస్టు 2012 : విద్యుత్ కోతలకు నిరసనగా శుక్రవారంనాడు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనున్న రాష్ట్ర బంద్ ప్రభుత్వానికి చెంపపెట్టు కావాలని పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు వై. విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్‌ కష్టాలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యత వహించాలని ఆయన గురువారం ఇక్కడ డిమాండ్ చేశారు. ప్రభుత్వం అసమర్థత కారణంగానే విద్యుత్ సంక్షోభం తలెత్తిందని విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు. అడ్డగోలు విద్యుత్ ‌కోతల వల్ల రైతులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రంలో కరెంట్ కష్టాలు రాలేదన్నారు. వైయస్‌ఆర్‌ పరిపాలించిన కాలంలో విద్యుత్ ఛార్జీలను పెంచని ‌విషయాన్ని పార్టీ నేత తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గుర్తు చేశారు.

Back to Top