చంద్రబాబును ఇంటికి పంపడం ఖాయం

ఢిల్లీ: ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా
మోస చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబును ఇంటికి పంపడం ఖాయమని వైయస్ఆర్
సీపీ సీనియర్ నాయకులు రహమాన్ అన్నారు. ఢిల్లీ లో జరుగుతున్న వంచన పై గర్జన సభలో
ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిపై ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడికి ముస్లింల గురించి
మాట్లాడే అర్హత లేదు. ముస్లింలందరూ ఆయనకు ఎప్పుడో త్రిపుల్ తలాఖ్ ఇచ్చారని
వ్యంగ్యాస్త్రాలు సంధించారు.మీ వంచనకు ప్రజలు తగిన బుద్ది
చెపుతారన్నారు.ఇంటికిపంపడం ఖాయమన్నారు. 

Back to Top