చంద్రబాబుకు పాలించే అర్హత లేదు

రాష్ట్ర ప్రజలను నిలువెత్తునా మోసం చేసిన చంద్రబాబు నాయుడికి
అధికారంలో కొనసాగే అర్హత లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి
మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. అనంతపురంలో జరుగుతున్న వంచన పై గర్జన దీక్షలో
ఆయన ప్రసంగిస్తూ, వచ్చే ఎన్నికల్లో పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం
చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలకు మరోసారి మోసపోడానికి ప్రజలు సిద్ధంగా
లేరన్నారు. 

ఆయన ఇంకా ఏమన్నారంటే..

 చంద్రబాబు మోసగాడు... దుర్మార్గుడు.. బయోముఖ విషవంచకుడు.. కేంద్రం
విభజన హామీలేవీ నెరవేర్చకపోయినా ప్రశ్నించకుండా నాలుగేళ్లు కాలక్షేపం చేసిన
చంద్రబాబు.. మోడీ గ్రాఫ్‌ తగ్గుతోందని పసిగట్టి ఎన్‌డీఏ నుంచి బయటకొచ్చారు తప్ప
ఏపీ మీద ఆయనకు ప్రేమ లేనేలేదు. మనల్ని పాలించే వ్యక్తి మనకన్నా యోగ్యుడై ఉండాలి.
కానీ చంద్రబాబుకు ఒక్క మంచి లక్షణం కూడా లేదు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం
పోరాడుతున్న పార్టీ వైయస్‌ఆర్‌సీపీ మాత్రమే. మా అధినేత వైయస్‌ జగన్‌
చెప్పినట్టుగానే మా ఎంపీ పదవులకు రాజీనామా చేశాం. మే త్యాగాలు చేశామని చెప్పడం
లేదు.. కేవలం మా బాధ్యతలు మాత్రమే నెరవేర్చడానికి నిస్సహాయ పరిస్థితుల్లో
రాజీనామాలు చేశాం. కేంద్రం మెడలు వంచడానికే మేమీ మార్గాన్ని ఎంచుకున్నాం. అయితే
చంద్రబాబు మాత్రం రాజీనామాలను వక్రీకరించి మాట్లాడటం సిగ్గుచేటు. ఉప ఎన్నికలంటూ
వచ్చి ఉంటే టీడీపీ, బీజేపీలు చిత్తుచిత్తుగా ఓడిపోయేవి. ప్రత్యేక హోదా ఐదున్నర కోట్ల
ప్రజల ఆకాంక్ష. రాష్ట్ర విభజన సమయంలో సీపీఎం నాయకుడు సీతారం ఏచూరి కూడా ఏపీకి
ప్రత్యేక హోదా కావాలని చెప్పారు. బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ కూడా
సమర్థించారు. వెంకయ్య నాయుడు పదేళ్లు హోదా కావాలంటే.. చంద్రబాబు పదిహేనేళ్లు
కావాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చాక హోదా ఇచ్చి తీరుతామని వెంకన్న సాక్షిగా
ప్రమాణం చేసి మాటతప్పారు. అధికారంలోకి వచ్చారు కానీ హోదా ఇవ్వకుండా ప్రజలను
మోసగించారు. హోదా వస్తే పరిశ్రమలు ఏర్పాటై అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లాలు
అభివృద్ధిలో దూసుకుపోతాయి. హోదా విషయంలో మోడీకి ఎంత బాధ్యత ఉందో.. చంద్రబాబుకు
కూడా అంతే బాధ్యత ఉంది. ఆరోజు ప్యాకేజీకి వంత పాడబట్టే ఈ రోజు మనకీ దుస్థితి
పట్టింది. ఎన్నికలు ఎప్పుడొచ్చిన వైయస్‌ఆర్‌సీపీ ఒంటరిగానే ఎన్నికలు వెళ్తుంది. ఏ
పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేసిన
చంద్రబాబుకు ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు. చంద్రబాబు
విచ్చలవిడిగా సంపాదించాడు. ఎన్నికల్లో ఎన్ని కోట్లయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా
ఉన్నాడు. ఆయనిచ్చిన డబ్బులు తీసుకోండి.. కానీ ఓటు మాత్రం మీ మనస్సాక్షి ప్రకారం
చేయండి. రాబోయే ఎన్నికల్లో 25 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలను గెలిపించి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
నాయకత్వంలో పోలవరాన్ని పూర్తి చేసుకుందాం.., ప్రత్యేక హోదా సాధించుకుందాం.., రైల్వే జోన్‌
సాధించుకుందాం. 2019 తర్వాత మన నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రంలో కీలక పాత్ర
పోషించబోతున్నారు. జగన్‌ను సీఎం చేసుకుంటే మన పిల్లల్ని ఉచితంగా చదివిస్తాడు.. మనకు
ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తాడు.. ప్రాజెక్టులు పూర్తిచేస్తాడు. 2019లో ఒక్కసారి జగన్‌కు అవకాశం ఇద్దాం. ఈసారి మాత్రం చంద్రబాబు
మోసపూరిత హామీలను నమ్మి మోసపోవద్దు. 

Back to Top