నయ వంచకుడు చంద్రబాబు..

కాకినాడః యువత,మహిళలు,రైతులు అన్నివర్గాల వారిని మోసం చేసిన నయవంచకుడు చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ నేత పినేపే విశ్వరూప్‌ అన్నారు. కాకినాడలో జరుగుతున్న  వంచనపై గర్జన నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలవరం కాంట్రాక్ట్‌ కోసం ప్యాకేజిలతో అవినీతికి పాల్పడ్డారన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని నిరుద్యోగులను చంద్రబాబు వంచించారన్నారు. 650 మోసపూరిత వాగ్ధానాలిచ్చి అందర్ని మోసం చేశారన్నారు. పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ కోసం చంద్రబాబు ప్రత్యేకహోదాను కేంద్రప్రభుత్వానికి తాకట్టు పెట్టారన్నారు. ప్రత్యేకహోదాపై పోరాడుతున్న ఏకైక  వ్యక్తి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు. అన్నివర్గాలకు అండగా వైయస్‌ జగన్‌ ఉన్నారన్నారు.  2004 నుంచి 2009 వరుకు దివంగత మహానేత వైయస్‌ఆర్‌ హయాంలో స్వర్ణయుగం చూశామన్నారు. రాజన్న పరిపాలన మళ్లీ రావాలంటే వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రావాలన్నారు. టీడీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేదాకా వైయస్‌ఆర్‌సీసీ శ్రేణులంతా  పోరాడాలన్నారు.

Back to Top