బాబు బీసీలకు చేసిందేమీ లేదు

  • టీడీపీవి ఓటు బ్యాంక్ రాజకీయాలు
  • బీసీలకిచ్చిన ఏ వాగ్ధానాన్ని బాబు నెరవేర్చలేదు
  • ఎన్నికలొస్తుండడంతో మళ్లీ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నాడు
  • బాబు ఏ వర్గానికి న్యాయం చేయడం లేదు.. 

    కులాలను రెచ్చగొడుతున్నారు

  • ఈనెల 16న బీసీ ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ సమావేశం
  • బీసీల పురోభివృద్ధి కోసం కార్యక్రమాల రూపకల్పన 
  • వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి
విజయవాడః టీడీపీ బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తోంది తప్ప అభివృద్ధికి పాటుపడడం లేదని  వైయస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మండిపడ్డారు. కులాలను చీల్చి చంద్రబాబు ఓటు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. రాష్ట్రంలో 50 శాతం ఉన్న వెనుకబడిన తరగతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జంగా కృష్ణమూర్తి మాట్లాడారు. బాబు తన గత 9 ఏళ్ల పాలనలోనూ, ప్రస్తుత మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు చేసిందేమీ లేదని జంగా విమర్శించారు. కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెలు ఇవ్వడం తప్ప బీసీల స్థితిగతులు ఏమాత్రం మార్చలేదన్నారు. మళ్లీ ఎన్నికలొస్తున్నాయని వెనుకబడిన తరగతులను ఉద్ధరిస్తానంటూ మభ్యపెడుతున్నారని ఫైర్ అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ సంపూర్ణంగా అమలు చేయడంతో పాటు  10వేల కోట్లతో ప్రత్యేక బడ్జెట్, చట్టసభల్లో బీసీలకు 100శాతం సీట్ల కేటాయిస్తానని బాబు మాట ఇచ్చాడు. అవిగాక నామినేషన్ పోస్టులు మూడోవంతు, ఉద్యోగాలు, విద్యకు సంబంధించి 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. రజకులు, బోయలను ఎస్టీలో వడ్డెరలను ఎస్సీలో చేరుస్తామన్నారు.  ఏ కులాన్ని వదలకుండా పుంఖానుపుంఖాలుగా అనేక  వాగ్ధానాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లవుతున్నా దాంట్లో ఏ ఒక్కటి అమలు చేయడం లేదని చంద్రబాబుపై కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
వైయస్ఆర్ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా లక్షలాది మంది బీసీ వర్గాలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు సౌకర్యం కల్పించారని జంగా కృష్ణమూర్తి గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ, పెన్షన్లు సహా అనేక పథకాలతో  అత్యధిక జనాభా ఉన్న బీసీలను ఆదుకున్నారని చెప్పారు. కానీ చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని కృష్ణమూర్తి ఫైర్ అయ్యారు. మూడున్నరేళ్లలో బీసీలకు ఇచ్చిన ఏ వాగ్ధానాన్ని నెరవేర్చని బాబు...మళ్లీ ఎన్నికలొస్తున్నాయని బీసీలకు సంబంధించి లక్ష పెళ్లిళ్లకు పెళ్లి కానుకగా 50వేలు ఇస్తానని మోసపూరిత ప్రకటనలు చేస్తున్నాడని జంగా ఆరోపించారు. నంద్యాల ఎన్నికల్లో ఆత్మీయ సదస్సుల పేరుతో కులపెద్దలను రెచ్చగొట్టాడని జంగా ఫైర్ అయ్యారు. 

చేనేత, మత్స్యకార్మికులు, బీసీ వర్గాల సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. వారికి న్యాయం చేయాలన్న ధృడసంకల్పంతో   ఫీజు రీయింబర్స్ మెంట్ ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీశారు. ఈనెల 16వ తేదీన బీసీ వర్గాలకు సంబంధించిన వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ సమావేశం ఏర్పాటు చేశారని, రాబోవు కాలంలో  బీసీల పురోభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి రూపకల్పన చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలకు నిరసనగా బీసీ ప్రజానీకాన్ని సంఘటిత పర్చి ప్రభుత్వం చేసిన వాగ్ధానాలు అమలు పర్చడం కోసం  విస్తృతస్థాయి సమావేశంలో రూపకల్పన చేస్తారన్నారు. మోసపూరిత వాగ్ధానాలు చేసి బాబు అధికారంలోకి వచ్చారని జంగా నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం అన్యాయాలు, ఆకృత్యాలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఏ వర్గానికి న్యాయం చేయడం లేదన్నారు. 
Back to Top